ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: దేశంలో ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైన్స్‌కు ప్రాముఖ్యత పెరిగిందని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) రిజిస్ట్రార్ కె.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. ఓయూ అతిథి గృహంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో 25వ పాన్ ఆసియా స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ బ్రోచర్‌ను ఆయన లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాభివృద్ధికి మరిన్ని పరిశోధనలు జరగాలని అభిలషించారు.
ఓయూలో స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరగనుండటం సంతోషంగా ఉందన్నారు. ఆగస్టు 8 నుంచి మూడు రోజులపాటు జరిగే ఈ కాన్ఫరెన్స్‌కు ఆసియా దేశాల ప్రతినిధులు హాజరు కానున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ కె.రాజేష్ కుమార్ వెల్లడించారు. ఈ సెమినార్ విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ చైర్మన్ ఇమాన్యుయెల్ ఎస్.కుమార్, ప్రొఫెసర్లు జె.ప్రభాకర్‌రావు, పి.వెంకట్‌రెడ్డి, ఎల్.బి.లక్ష్మీకాంత్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
స్పోర్ట్స్ సైన్స్ ప్రాధాన్యత పెరిగింది
Published Mon, Mar 10 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
Advertisement
Advertisement