ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సెంట్రల్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ టీమ్ టైటిల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్టు చేజిక్కించుకుంది. బిలాస్‌పూర్ యూనివర్సిటీలో జరిగిన ఫైనల్లో ఉస్మానియా 2-0 స్కోరుతో జేఎన్‌టీయూ (హైదరాబాద్) జట్టుపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో అనుష్క భార్గవ (ఓయూ) 6-3, 6-2 స్కోరుతో మౌలిక రామ్ (జేఎన్‌టీయూ)పై విజయం సాధించింది. రెండో సింగిల్స్‌లో కాల్వ భువన (ఓయూ) 6-0, 6-0తో వై.సింధూర (జేఎన్‌టీయూ)పై గెలిచింది.
అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఓయూ జట్టు 2-0తో అలహాబాద్ యూనివర్సిటీపై గెలిచింది. సింగిల్స్ జాతీయ స్కూల్ టెన్నిస్ మాజీ చాంపియన్ శాంభవి దీక్షిత్ (ఓయూ) 6-0, 6-0తో ఆయూషీ యాదవ్‌పై, అమ్రీన్ నాజ్ (ఓయూ) 6-0, 6-0తో షేక్ నాజ్‌పై గెలిచారు. రెండో సెమీస్‌లో జేఎన్‌టీయూ 2-1తో బిలాస్‌పూర్ జట్టుపై గెలిచింది. సింగిల్స్‌లో మౌలిక రామ్ 6-2, 6-3తో ముక్తాపై గెలిచింది. రెండో సింగిల్స్‌లో వై.సింధూర (జేఎన్‌టీయూ) 3-6, 4-6తో నేహా చేతిలో ఓడిపోయింది. డబుల్స్‌లో మౌలిక రామ్, వై.సింధూర జోడి 6-1, 6-2తో నేహా, ముక్తా జోడిపై నెగ్గింది.
ఉస్మానియాకు టెన్నిస్ టైటిల్
Published Mon, Jan 13 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement
Advertisement