ఓయూ జట్టుకు స్వర్ణం | osmania university team won gold medal in chess tournment | Sakshi
Sakshi News home page

ఓయూ జట్టుకు స్వర్ణం

Published Thu, Jan 16 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

osmania university team won gold medal in chess tournment

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పురుషుల చెస్ టోర్నమెంట్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మహారాష్ట్రలోని రాహూరిలోని మహాత్మా ఫూలే కృషి విద్యా పీఠ్‌లో గురువారం జరిగిన చివరిదైన ఆరో రౌండ్‌లో జాదవ్‌పూర్ యూనివర్సిటీ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను ఓయూ డ్రా చేసుకుంది. దీంతో 11 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది.
 
 దాదాపు 45 ఏళ్ల విరామం తర్వాత జాతీయ ఇంటర్ వర్సిటీ చెస్ టోర్నీలో ఓయూ స్వర్ణం చేజిక్కించుకోవడం విశేషం.
 స్వర్ణం గెలిచిన ఓయూ చెస్ జట్టు: సి.ఆర్.జి.కృష్ణ (కెప్టెన్), రవితేజ, దీప్తాంశ్‌రెడ్డి, ఆనంద్ నాయక్, విశ్వనాథ్ ప్రసాద్, నిఖిల్ రెడ్డి. ఓయూ జట్టుకు రాష్ట్ర చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి కె.కన్నారెడ్డి కోచ్‌గా, మేనేజర్‌గా శివప్రసాద్‌రెడ్డిలు వ్యవహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement