ప్రపంచ మహిళల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ కొత్త నంబర్‌వన్ ప్లేయర్‌గా అవతరించనుంది. మయామి ఓపెన్ టోర్నీ రెండో రౌండ్‌లో రెండో ర్యాంకర్ స్వియాటెక్ 6–2, 6–0తో గొలుబిక్ (స్విట్జర్లాండ్)పై నెగ్గడంతో ఆమెకు నంబర్‌వన్ ర్యాంక్ ఖాయమైంది. ప్రస్తుత నంబర్‌వన్ యాష్లే బార్టీ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దాంతో ఏప్రిల్ 4న విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా స్వియాటెక్‌కు టాప్ ర్యాంక్ ఖరారవుతుంది.
చదవండి: ipl 2022: "ఉమేశ్ అన్న ముందే చెప్పాడు.. నిజం చేశాడు కదా
Comments
Please login to add a commentAdd a comment