Tennis Ranking
-
భారత మహిళల టెన్నిస్ నంబర్‌వన్‌గా సహజ
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా అంతర్జాతీయ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ టెన్నిస్ ప్లేయర్ సహజ యామలపల్లి భారత నంబర్‌వన్ ర్యాంకర్‌గా అవతరించింది. సోమవారం విడుదల చేసిన ప్రపంచ మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 22 ఏళ్ల సహజ ఒక స్థానం మెరుగుపర్చుకొని 302వ ర్యాంక్‌కు చేరుకుంది. చాలా కాలంగా భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న 31 ఏళ్ల అంకిత రైనా 24 స్థానాలు పడిపోయి 307వ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ సీజన్లో సహజ 27 మ్యాచ్‌ల్లో గెలిచి, 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. గతవారం డొమినికన్ రిపబ్లిక్లో జరిగిన పుంటా కానా ఓపెన్ ఐటీఎఫ్ టోర్నీలో సహజ సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఇక ఇండియా నంబర్ వన్ ర్యాంకర్‌గా నిలవడం తనకు సంతోషంగా ఉందని.. కీలకమైన మైలురాయిని చేరుకున్నానని సహజ హర్షం వ్యక్తం చేసింది. అయితే, ర్యాంకుల గురించి తాను పెద్దగా పట్టించుకోనని.. ఆటపై మాత్రమే దృష్టి సారిస్తానని తెలిపింది. -
దిగజారిన నాదల్.. 18 ఏళ్లలో ఇదే తొలిసారి
స్పెయిన్ బుల్.. టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ 18 ఏళ్ల తర్వాత టాప్-10 ర్యాంకింగ్స్ నుంచి దిగువకు పడిపోయాడు. గాయం కారణంగా జనవరి నుంచి ఆటకు దూరంగా ఉన్న నాదల్ క్రమేపీ ర్యాంకింగ్స్‌లో దిగజారుతూ వచ్చాడు. తాజాగా ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నీ ముగిసిన తర్వాత విడుదల చేసిన పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నాదల్ 13వ స్థానంలో నిలిచాడు. కాగా 2005లో తొలిసారి టెన్నిస్‌లో టాప్-10లోకి ఎంటర్ అయిన నాదల్ అప్పటినుంచి 18 ఏళ్ల పాటు టాప్-10లోనే కొనసాగాడు. ఒక రకంగా ఇన్నేళ్లపాటు టాప్-10లో కొనసాగడం కూడా నాదల్కు రికార్డే. గతంలో 209 వారాల పాటు నెంబర్‌వన్‌గా ఉండి చరిత్ర సృష్టించిన నాదల్ ఐదుసార్లు నెంబర్‌వన్ ర్యాంక్‌తో ఏడాదిని ముగించాడు. నాదల్ తర్వాత జిమ్మీ కానర్స్ 15 ఏళ్ల పాటు టాప్-10లో కొనసాగాడు. ప్రస్తుతం నాదల్, జొకోవిచ్‌తో కలిసి 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సంయుక్తంగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్లో వెనుదిరిగిన నాదల్ అనంతరం తుంటి గాయం బారిన పడ్డాడు. గాయం నుంచి నుంచి కోలుకున్న నాదల్ వచ్చే నెలలో జరగనున్న మాంటే కార్లో టెన్నిస్ టోర్నమెంట్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ టోర్నీలో నాదల్కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు 11సార్లు మాంటే కార్లో టైటిల్ నెగ్గిన నాదల్ ఓపెన్ శకంలో 2005 నుంచి 2012 వరకు వరుసగా ఎనిమిది సార్లు టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. ఇక ఇండియన్ వెల్స్ టోర్నీలో విజేతగా నిలిచిన స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌గా అవతరించాడు.ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో 19 ఏళ్ల అల్కరాజ్ తొలిసారి విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ 6–3, 6–2తో ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొందాడు. ఈ టోర్నీకి ముందు సెర్బియా స్టార్ జొకోవిచ్ టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. కోవిడ్ టీకా వేసుకోని విదేశీయులకు అమెరికాలో ప్రవేశం లేకపోవడంతో జొకోవిచ్ ఈ టోరీ్నకి దూరం కావాల్సి వచ్చింది. 7,160 పాయింట్లతో జొకోవిచ్ రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. సోమవారం మొదలైన మయామి ఓపెన్ టోర్నీలోనూ అల్కరాజ్ విజేతగా నిలిస్తేనే నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటాడు. లేదంటే ఏప్రిల్ 3న విడుదల చేసే ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ మళ్లీ టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంటాడు. చదవండి: వుమెన్స్ ప్రీమియర్ లీగ్ ఎంతవరకు విజయవంతం? And there it is: After an incredible streak of 934 weeks--falling just a single month short of 18 years--Rafael Nadal has slipped outside the top 10, which he first entered on April 25, 2005. pic.twitter.com/RllZXnNwT1 — Ben Rothenberg (@BenRothenberg) March 20, 2023 -
ప్రపంచ మహిళల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్.. నంబర్‌వన్‌గా స్వియాటెక్
ప్రపంచ మహిళల టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ కొత్త నంబర్‌వన్ ప్లేయర్‌గా అవతరించనుంది. మయామి ఓపెన్ టోర్నీ రెండో రౌండ్లో రెండో ర్యాంకర్ స్వియాటెక్ 6–2, 6–0తో గొలుబిక్ (స్విట్జర్లాండ్)పై నెగ్గడంతో ఆమెకు నంబర్‌వన్ ర్యాంక్ ఖాయమైంది. ప్రస్తుత నంబర్‌వన్ యాష్లే బార్టీ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. దాంతో ఏప్రిల్ 4న విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో అధికారికంగా స్వియాటెక్‌కు టాప్ ర్యాంక్ ఖరారవుతుంది. చదవండి: ipl 2022: "ఉమేశ్ అన్న ముందే చెప్పాడు.. నిజం చేశాడు కదా -
Roger Federer: నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి...
Roger Federer: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నాలుగేళ్ల తొమ్మిది నెలల తర్వాత తొలిసారి టాప్–10 ర్యాంకింగ్స్‌లో చోటు కోల్పోయాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో 40 ఏళ్ల ఫెడరర్ రెండు స్థానాలు పడిపోయి 11వ ర్యాంక్‌లో నిలిచాడు. కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఫెడరర్ ఈ ఏడాది జూలైలో వింబుల్డన్ టోర్నీ తర్వాత మోకాలి గాయం తిరగబెట్టడంతో మరే టోర్నీలోనూ ఆడలేదు. చదవండి: Mary Kom: ఎవ్వరికీ ఆ ఛాన్స్ లేదు.. కానీ ఆమెకు మాత్రం మినహాయింపు?! -
అగ్రస్థానానికి అడుగు దూరంలో సానియా
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అగ్రస్థానానికి చేరుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. మరో 145 పాయింట్లు సాధిస్తే మహిళల డబుల్ విభాగంలో సానియా నంబర్ వన్ అవుతుంది. మియామీ టైటిల్ నెగ్గడంతో ఆమె ఖాతాలో 1000 పాయింట్లు చేరాయి. ప్రస్తుతం సానియా 7495 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉంది. నంబర్ వన్ ర్యాంకులో కొనసాతున్న ఇటలీ క్రీడాకారిణులు సారా ఎరాలీ, రాబర్టా విన్సీ ఖాతాలో మొత్తం 7640 పాయింట్లు ఉన్నాయి. చార్లెస్టన్ లో ఈవారం ప్రారంభంకానున్న ఫ్యామిలీ సర్కిల్ కప్ లో సానియా విజయం సాధిస్తే ఆమె అగ్రస్థానానికి చేరుతుంది. ఎలెనా వెస్నినాతో కలిసి 2011లో ఫ్యామిలీ సర్కిల్ కప్ టైటిల్ ను సానియా మీర్జా కైవసం చేసుకుంది.