అగ్రస్థానానికి అడుగు దూరంలో సానియా | Sania inches closer to world number one rank | Sakshi
Sakshi News home page

అగ్రస్థానానికి అడుగు దూరంలో సానియా

Published Mon, Apr 6 2015 11:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM

అగ్రస్థానానికి అడుగు దూరంలో సానియా

అగ్రస్థానానికి అడుగు దూరంలో సానియా

న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అగ్రస్థానానికి చేరుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. మరో 145 పాయింట్లు సాధిస్తే మహిళల డబుల్ విభాగంలో సానియా నంబర్ వన్ అవుతుంది. మియామీ టైటిల్ నెగ్గడంతో ఆమె ఖాతాలో 1000 పాయింట్లు చేరాయి. ప్రస్తుతం సానియా 7495 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉంది.

నంబర్ వన్ ర్యాంకులో కొనసాతున్న ఇటలీ క్రీడాకారిణులు సారా ఎరాలీ,  రాబర్టా విన్సీ ఖాతాలో మొత్తం 7640 పాయింట్లు ఉన్నాయి. చార్లెస్టన్ లో ఈవారం ప్రారంభంకానున్న ఫ్యామిలీ సర్కిల్ కప్ లో సానియా విజయం సాధిస్తే ఆమె అగ్రస్థానానికి చేరుతుంది. ఎలెనా వెస్నినాతో కలిసి 2011లో ఫ్యామిలీ సర్కిల్ కప్ టైటిల్ ను సానియా మీర్జా కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement