Indian Wells tournament
-
Novak Djokovic: వ్యాక్సిన్ వేసుకోలేదని..
ఇండియన్‌వెల్స్: వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌ను ఇంకా కరోనా వ్యాక్సిన్ కష్టాలు వీడటం లేదు. అతను వ్యాక్సిన్ వేసుకోలేదనే కారణంతో అమెరికా ప్రభుత్వం తమ దేశంలోకి అడుగు పెట్టేందుకు అతడిని అనుమతించలేదు. దాంతో ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ టోర్నమెంట్‌నుంచి అతను తప్పుకున్నాడు. తనకు మినహాయింపు ఇవ్వాలంటూ జొకోవిచ్ చేసిన దరఖాస్తును అక్కడి అధికారులు తిరస్కరించారు. ఇండియన్వెల్స్తో పాటు మరో పెద్ద టోర్నీ మయామీ ఓపెన్‌కు కూడా జొకోవిచ్ దూరం కానున్నాడు. ఈ రెండు టోర్నీలు మార్చి 19 – ఏప్రిల్ 2 మధ్య జరుగుతాయి. -
టెన్నిస్ స్టార్ అసహనం.. మతి పోయిందా ఏమన్నా అయ్యుంటే?
ఆస్ట్రేలియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నిక్ కిర్గియోస్ సహనం కోల్పోయాడు. ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నీలో భాగంగా రఫెల్ నాదల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 7-6(0), 5-7, 6-4తో కిర్గియోస్ ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ముగియడంతో ఆటగాళ్లిద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చకున్నారు. ఆ తర్వాత కోర్టు అంపైర్‌కు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడివరకు బాగానే ఉంది. అసలు కథ మొదలైంది ఇక్కడే. నాదల్ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయాడేమో.. కిర్గియోస్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు. తన చేతిలో ఉన్న రాకెట్‌ను బలంగా నేలకేసి కొట్టడంతో అది కాస్తా పల్టీలు కొట్టుకుంటూ బాల్ బాయ్ వైపు వెళ్లింది. అయితే బాల్‌బాయ్ చాకచక్యంగా వ్యవహరించిన పక్కకు తప్పుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీంతో షాక్ తిన్న అభిమానులు కిర్గియోస్ వైఖరిని తప్పుబట్టారు. ''నాదల్ చేతిలో ఓడినంత మాత్రానా సహనం కోల్పోవాలా.. అయినా రాకెట్‌ను అలా నేలకేసి కొట్టడం ఏంటి.. కాస్తైనా బుద్దుందా.. బాల్‌బాయ్ తగిలిని గాయాలు సీరియస్ అయితే పరిస్థితి ఏంటని'' ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాసేపటికి విషయం తెలుసుకున్న కిర్గియోస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా బాల్బాయ్కు క్షమాపణ చెప్పుకున్నాడు. ''ఏదో మ్యాచ్ ఓడిపోయాడననే కోపంలో అలా చేశాను. కావాలని మాత్రం చేయలేదు. నేను నేలకేసి కొట్టిన రాకెట్ యాక్సిడెంటల్‌గా వెళ్లి బాల్బాయ్కి తగిలింది. అతనికి తగలడం నాకు బాధ కలిగించింది. ఆ బాల్ బాయ్ గురించి ఎవరైనా తెలిస్తే చెప్పండి. వెంటనే అతనికి ఒక టెన్నిస్ రాకెట్‌ను గిఫ్ట్‌గా అందిస్తా. ఆ అబ్బాయి బాగుండాలని కోరుకుంటున్నా'' అంటూ రాసుకొచ్చాడు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. ఇటీవలే జర్మనీకి చెందిన 24 ఏళ్ల టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ కోర్టు అంపైర్‌పై అసహనం వ్యక్తం చేస్తూ అతన్ని కొట్టినంత పని చేయడం ఎవరు మరిచిపోలేదు. ఈ విషయంలో జ్వెరెవ్ క్షమాపణ కోరడంతో సస్పెన్షన్ నిలిపివేశారు. అంతకముందు సెర్బియా టెన్నిస్‌స్టార్ నొవాక్ జొకోవిచ్.. స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ చాలా సందర్భాల్లో తమ అసహనాన్ని వ్యక్తం చేసి ఇతరులకు ఇబ్బంది కలిగించారు. దీంతో ఇప్పటికైనా కోర్టులో ఉన్నంతసేపు ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అణిచిపెట్టుకునేలా రూల్స్ సవరించాలని.. మరోసారి ఏ ఆటగాడు కోర్టు ఆవరణలో సహనం కోల్పోకుండా ఉండాలంటే.. మ్యాచ్‌ల నిషేధం లేదా భారీ జరిమానా విధించడం చేస్తే కరెక్ట్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: Avesh Khan- Venkatesh Iyer: అయ్యర్‌తో కలిసి స్టెప్పులు ఇరగదీసిన ఆవేశ్ ఖాన్.. వీడియో PAK vs AUS: 24 ఏళ్ల క్రితం రాళ్లు రువ్వారు.. కట్‌చేస్తే 19 and counting 👏@RafaelNadal remains unbeaten this year and defeats Kyrgios to reach his 76th Masters 1000 semi-final of his career!#IndianWells pic.twitter.com/GelYj9S44L — Tennis TV (@TennisTV) March 18, 2022 Nick Kyrgios’ temper tantrums creating a dangerous environment for everyone involved. barely two weeks after Alexander Zverev whacked his racket against the umpire’s chair. and this is supposed to be a “poised” sport? pic.twitter.com/422PnfesE3 — m⁴⁷ FRAUDIAN WELLS (@tsitschurrow) March 18, 2022 -
క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్, నాదల్
ఇండియన్ వెల్స్ (అమెరికా): ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో దిగ్గజాలు రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ (స్పెయిన్) 6–3, 6–4తో సెర్బియన్ క్వాలిఫయర్ ఫిలిప్ క్రాజినొవిక్ను ఇంటిదారి పట్టించా డు. ఆరో టైటిల్ రికార్డుపై కన్నేసిన నాలుగో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–1, 6–4తో కైల్ ఎడ్మండ్ (బ్రిటన్)పై అలవోక విజయం సాధించాడు. నాదల్, ఫెడరర్ ఇద్దరు క్వార్టర్స్ మ్యాచ్‌ల్ని గెలిస్తే సెమీస్‌లో ముఖా ముఖీగా తలపడతారు. నేటి క్వార్టర్ ఫైనల్లో నాదల్... ప్రపంచ 13వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)తో, ఫెడరర్... హుబెర్ట్ హర్కజ్ (పొలండ్)తో తలపడతార -
ఫెడరర్‌కు షాక్
ఫ్లోరిడా (అమెరికా): వారం వ్యవధిలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు రెండో పరాజయం ఎదురైంది. గత ఆదివారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ఓడిన ఫెడరర్... మయామి మాస్టర్స్ టోర్నీలో మాత్రం రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 175వ ర్యాంకర్ థనాసి కొకినాకిస్ (ఆస్ట్రేలియా)తో జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ ఫెడరర్ 6–3, 3–6, 6–7 (4/7)తో పరాజయం పాలయ్యాడు. గతేడాది ఇండియన్ వెల్స్, మయామి మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ఫెడరర్ ఈసారి వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. మయామి టోర్నీలో రెండో రౌండ్లోనే ఓడినందుకు ఫెడరర్ భారీ మూల్యమే చెల్లించుకోనున్నాడు. ఏప్రిల్ 2న విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అతను తన టాప్ ర్యాంక్‌ను కోల్పోనున్నాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న రాఫెల్ నాదల్ (స్పెయిన్) మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకుంటాడు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తాను క్లే కోర్టు సీజన్లో బరిలోకి దిగడంలేదని ఫెడరర్ ప్రకటించాడు. ఫలితంగా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ఫెడరర్ వరుసగా రెండో ఏడాది దూరం కానున్నాడు. తగినంత విశ్రాంతి తీసుకొని జూన్‌లో జరిగే వింబుల్డన్ టోర్నమెంట్‌కు సిద్ధమవుతానని తెలిపాడు. యూకీ బాంబ్రీ ఓటమి: మరోవైపు మయామి మాస్టర్స్ టోర్నీలో భారత ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో యూకీ 3–6, 6–7 (3/7)తో ఎనిమిదో సీడ్ జాక్ సోక్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో ఓడిన యూకీకి 25,465 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షల 55 వేలు)తోపాటు 25 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఇండియన్ వెల్స్, మయామి టోర్నీలకు నాదల్ దూరం
ఫ్లోరిడా: తుంటి గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఇండియన్ వెల్స్, మయామి మాస్టర్స్ సిరీస్ టోర్నీలకు దూరమయ్యాడు. ‘గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అందుకే ఇండియన్ వెల్స్, మయామి టోర్నమెంట్లకు దూరమవుతున్నాను. క్లే కోర్టు సీజన్ వరకు తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తా’ అని పేర్కొన్నాడు. 31 ఏళ్ల నాదల్ గతంలో మూడు సార్లు (2007, 2009, 2013) ఇండియన్ వెల్స్ టైటిల్స్ గెలుచుకున్నాడు. ఐదు సార్లు (2005, 2008, 2011, 2014, 2017) మయామి ఫైనల్‌కు చేరాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్‌లో ఓడిన అనంతరం నాదల్ కోర్టులో అడుగు పెట్టలేదు. మరోవైపు ప్రస్తుతం వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్న రోజర్ ఫెడరర్ తన ర్యాంక్‌ను కాపాడుకోవాలంటే ఇండియన్ వెల్స్ టోర్నీలో కనీసం సెమీస్‌కు చేరాల్సి ఉంటుంది. లేదంటే నాదల్ మళ్లీ నంబర్‌వన్ అవుతాడు. -
రన్నరప్ సానియా జోడి
స్టట్గార్ట్ (జర్మనీ): ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు మరోసారి నిరాశ ఎదురైంది. పోర్షె గ్రాండ్‌ప్రి డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్లో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. టాప్ సీడ్ సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) జోడి 6-2, 6-3తో సానియా-కారా బ్లాక్ జంటను ఓడించి విజేతగా నిలిచింది. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడి ఏస్ కానీ, డబుల్ ఫాల్ట్గానీ నమోదు చేయలేదు. అయితే తమ సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. రన్నరప్ సానియా జంటకు 16,129 యూరోలు (రూ. 13 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఇటీవల ఇండియన్ వెల్స్ టోర్నీ ఫైనల్లోనూ సానియా-కారా బ్లాక్ జోడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.