రన్నరప్ సానియా జోడి | Sania Mirza, Cara Black end runners-up in Stuttgart WTA event | Sakshi
Sakshi News home page

రన్నరప్ సానియా జోడి

Published Mon, Apr 28 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM

రన్నరప్ సానియా జోడి

రన్నరప్ సానియా జోడి

స్టట్‌గార్ట్ (జర్మనీ): ఈ ఏడాది తొలి డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు మరోసారి నిరాశ ఎదురైంది. పోర్షె గ్రాండ్‌ప్రి డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో రెండో సీడ్ సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. టాప్ సీడ్ సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) జోడి 6-2, 6-3తో సానియా-కారా బ్లాక్ జంటను ఓడించి విజేతగా నిలిచింది.

 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడి ఏస్ కానీ, డబుల్ ఫాల్ట్‌గానీ నమోదు చేయలేదు. అయితే తమ సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. రన్నరప్ సానియా జంటకు 16,129 యూరోలు (రూ. 13 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఇటీవల ఇండియన్ వెల్స్ టోర్నీ ఫైనల్లోనూ సానియా-కారా బ్లాక్ జోడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement