ఇండియన్ వెల్స్ (అమెరికా): ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో దిగ్గజాలు రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ (స్పెయిన్) 6–3, 6–4తో సెర్బియన్ క్వాలిఫయర్ ఫిలిప్ క్రాజినొవిక్‌ను ఇంటిదారి పట్టించా డు. ఆరో టైటిల్ రికార్డుపై కన్నేసిన నాలుగో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–1, 6–4తో కైల్ ఎడ్మండ్ (బ్రిటన్)పై అలవోక విజయం సాధించాడు. నాదల్, ఫెడరర్ ఇద్దరు క్వార్టర్స్ మ్యాచ్‌ల్ని గెలిస్తే సెమీస్‌లో ముఖా ముఖీగా తలపడతారు. నేటి క్వార్టర్ ఫైనల్లో నాదల్... ప్రపంచ 13వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)తో, ఫెడరర్... హుబెర్ట్ హర్కజ్ (పొలండ్)తో తలపడతార
Comments
Please login to add a commentAdd a comment