ఫెడరర్‌ x నాదల్‌ | Roger Federer and Rafael Nadal win to set up special French Open semi final | Sakshi
Sakshi News home page

ఫెడరర్‌ x నాదల్‌

Published Wed, Jun 5 2019 3:52 AM | Last Updated on Wed, Jun 5 2019 3:52 AM

Roger Federer and Rafael Nadal win to set up special French Open semi final  - Sakshi

పారిస్‌: తమ విజయ పరంపర కొనసాగిస్తూ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌ సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో నాదల్‌ (స్పెయిన్‌) 6–1, 6–1, 6–3తో ఏడో సీడ్‌ నిషికోరి (జపాన్‌)ను... మూడో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 7–6 (7/4), 4–6, 7–6 (7/5), 6–4తో మాజీ చాంపియన్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌)ను ఓడించారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో వీరిద్దరు తలపడనుండటం 2011 తర్వాత ఇదే తొలిసారి కానుంది. ఓవరాల్‌గా వీరి ద్దరు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఐదుసార్లు తలపడగా... ఐదుసార్లూ నాదల్‌నే విజయం వరించింది. మహిళల సిం గిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో జొహనా కొంటా (బ్రిటన్‌) 6–1, 6–4తో స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా)పై గెలిచింది. 1983లో జో డ్యూరీ తర్వాత ఈ టోర్నీలో సెమీస్‌ చేరిన తొలి బ్రిటన్‌ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement