Nishikori
-
ఫెడరర్ x నాదల్
పారిస్: తమ విజయ పరంపర కొనసాగిస్తూ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో నాదల్ (స్పెయిన్) 6–1, 6–1, 6–3తో ఏడో సీడ్ నిషికోరి (జపాన్)ను... మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7–6 (7/4), 4–6, 7–6 (7/5), 6–4తో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను ఓడించారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో వీరిద్దరు తలపడనుండటం 2011 తర్వాత ఇదే తొలిసారి కానుంది. ఓవరాల్‌గా వీరి ద్దరు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఐదుసార్లు తలపడగా... ఐదుసార్లూ నాదల్‌నే విజయం వరించింది. మహిళల సిం గిల్స్ క్వార్టర్ ఫైనల్లో జొహనా కొంటా (బ్రిటన్) 6–1, 6–4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచింది. 1983లో జో డ్యూరీ తర్వాత ఈ టోర్నీలో సెమీస్ చేరిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. -
ఫెడరర్‌కు చుక్కెదురు
లండన్: కెరీర్లో వందో టైటిల్‌తో ఈ ఏడాదిని ముగించాలని ఆశిస్తున్న స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు సీజన్ చివరి టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో శుభారంభం లభించలేదు. ‘లీటన్ హెవిట్ గ్రూప్’లో భాగంగా జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఫెడరర్ 6–7 (4/7), 3–6తో కీ నిషికోరి (జపాన్) చేతిలో ఓడిపోయాడు. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్లో ఇద్దరూ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో నిషికోరి పైచేయి సాధించి తొలి సెట్ గెల్చుకున్నాడు. రెండో సెట్లోని తొలి గేమ్‌లోనే నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ వెంటనే తన సర్వీస్‌ను చేజార్చుకున్నాడు. ఆరో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను రెండోసారి బ్రేక్ చేసిన నిషికోరి ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని విజయాన్ని దక్కించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఫెడరర్ 34 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6–3, 7–6 (12/10)తో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై గెలిచాడు. గతంలో రికార్డుస్థాయిలో ఆరుసార్లు సీజన్ ముగింపు టోర్నీ టైటిల్ నెగ్గిన ఫెడరర్ సెమీఫైనల్ రేసులో నిలవాలంటే డొమినిక్ థీమ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి. -
నిషాకోరి కొత్త చరిత్ర
రియో డీ జనీరో:రియో ఒలింపిక్సలో జపాన్ టెన్నిస్ క్రీడాకారుడు కియో నిషాకోరీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా కాంస్య పతక పోరులో నిషాకోరీ 6-2, 6-7(1), 6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌పై సంచలన విజయం సాధించాడు. దీంతో 1920 తరువాత పురుషుల సింగిల్స్ లో ఒలింపిక్స్ పతకం సాధించిన జపాన్ క్రీడాకారుడిగా నిషాకోరీ నిలిచాడు. ఈ మ్యాచ్ లో తొలి సెట్‌ను అవలీలగా గెలిచిన నిషాకోరీ.. రెండో సెట్లో మాత్రం నాదల్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. కాగా, టై బ్రేక్‌కు దారి తీసిన ఆ సెట్‌ను నిషాకోరీ కోల్పోయాడు. దీంతో నిర్ణయాత్మక మూడో సెట్లో తిరిగి పుంజుకున్న నిషాకోరీ ఆ సెట్‌ను సునాయాసంగా గెలిచాడు. దీంతో ఒలింపిక్స్ లో మరోసారి పతకం సాధించాలనుకున్న నాదల్ ఆశలకు బ్రేక్ పడింది. 2008 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నాదల్.. 2012 లండన్ ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. మరోవైపు బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రే స్వర్ణాన్ని సాధించాడు. తుదిపోరులో ముర్రే 7-5, 4-6, 6-3, 7-5 తేడాతో డెల్ పాట్రో(అర్జెంటీనా)పై గెలిచి వరుసగా రెండోసారి ఒలింపిక్స్ లో పసిడిని కైవసం చేసుకున్నాడు. గత లండన్ ఒలింపిక్స్ లో ముర్రే స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. -
ముగురుజాకు షాక్
* వింబుల్డన్ రెండో రౌండ్లోనే ఇంటిముఖం * అన్‌సీడెడ్ సెపలోవా చేతిలో ఓటమి * మూడోరౌండ్లో ముర్రే, నిషికోరి, రావోనిక్ లండన్: గత మూడు రోజులు సాఫీగా సాగిన వింబుల్డన్‌లో నాలుగో రోజు పెను సంచలనం నమోదైంది. ఫ్రెంచ్ ఓపెన్ విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్ గార్బిని ముగురుజా (స్పెయిన్) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 127వ ర్యాంకర్ జానా సెపలోవా (స్లొవేకియా) 6-3, 6-2తో రెండోసీడ్ ముగురుజాపై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. 59 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెపలోవా సర్వీస్‌లో చెలరేగిపోయింది. బలమైన ఫోర్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో స్పెయిన్ ప్లేయర్ ఆట కట్టించింది. తొలిసెట్ రెండో గేమ్‌లోనే సర్వీస్‌ను కోల్పోవడం ముగురుజాపై ప్రభావం చూపింది. నాలుగు, ఏడు, ఎనిమిది గేమ్‌ల్లో సర్వీస్‌ను కాపాడుకున్నా ఫలితం లేకపోయింది. ఇక రెండో సెట్లో సెపలోవా మరింత జోరు చూపెట్టింది. రెండుసార్లు సర్వీస్‌ను కాపాడుకున్న ఆమె రెండుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి నాలుగు గేమ్‌ల్లో ముగురుజా రెండుసార్లు సర్వీస్‌ను కాపాడుకున్నా... ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయలేక మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఓవరాల్‌గా ముగురుజా మ్యాచ్ మొత్తంలో 22సార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో 4వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-1, 6-4తో లెప్చెంకో (అమెరికా)పై; 5వ సీడ్ హలెప్ (రొమేనియా) 6-1, 6-1తో షియావోన్ (ఇటలీ)పై; 8వ సీడ్ వీనస్ (అమెరికా) 7-5, 4-6, 6-3తో మరియా సక్కారి (గ్రీక్)పై; 9వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6-4, 4-6, 6-3తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై; 11వ సీడ్ బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్) 6-4, 6-2తో కుమ్కుమ్ (థాయ్‌లాండ్)పై; 12వ సీడ్ నవారో (స్విట్జర్లాండ్) 3-6, 6-2, 6-1తో అలెర్టోవా (చెక్)పై; లిసికి (జర్మనీ) 6-4, 6-2తో 14వ సీడ్ స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై గెలిచి తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టారు. బొసెరుప్ (అమెరికా) 6-4, 1-0 ఉన్న దశలో ఏడోసీడ్ బెనిసిచ్ (స్విట్జర్లాండ్) మ్యాచ్ నుంచి వైదొలిగింది. ముర్రే జోరు... పురుషుల సింగిల్స్‌లో రెండోసీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) జోరు కొనసాగిస్తున్నాడు. రెండోరౌండ్లో 6-3, 6-2, 6-1తో యెన్ సున్ లూ (తైపీ)పై నెగ్గి మూడోరౌండ్లోకి ప్రవేశించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఐదోసీడ్ నిషికోరి (జపాన్) 4-6, 6-4, 6-4, 6-2తో బెన్నెట్ (ఫ్రాన్స్)పై; 6వ సీడ్ రావోనిక్ (కెనడా) 7-6 (5), 6-4, 6-2తో సెప్పీ (ఇటలీ)పై; 9వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 6-2, 6-7 (6), 6-4, 6-4తో స్టాకోవోస్కీ (ఉక్రెయిన్)పై; 11వ సీడ్ గోఫిన్ (బెల్జియం) 6-4, 6-0, 6-3తో రోజెర్ వాసెలిన్ (ఫ్రాన్స్)పై; మహుట్ (ఫ్రాన్స్) 6-1, 6-4, 6-3తో 13వ సీడ్ ఫెరర్ (స్పెయిన్)పై; దిమిత్రోవ్ (బల్గేరియా) 6-3, 7-6 (1), 4-6, 6-4తో 16వ సీడ్ సిమోన్స్ (ఫ్రాన్స్)పై గెలిచారు. 14వ సీడ్ అగుట్ (స్పెయిన్)కు... కుష్కిన్ (కజకిస్తాన్) నుంచి వాకోవర్ లభించింది. -
ఫైనల్లో నిషికోరి.. జొకోవిచ్ అవుట్
న్యూయార్క్: జపాన్ ఆటగాడు కీ నిషికోరి సంచలనం సృష్టించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్‌ను 6-4, 1-6, 7-6 (7-4), 6-3తో మట్టి కరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దీంతో యూఎస్ ఓపెన్‌లో 96 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన తొలి జపాన్ ఆటగాడయ్యాడు. గత రెండుసార్లు రన్నరప్ అయిన జొకోవిచ్ రెండో సెట్‌ను గెలుచుకున్నా.. హోరాహోరీగా సాగిన మూడో సెట్‌ను కోల్పోయాడు. నాలుగో సెట్లో ఆరంభం నుంచే అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.