జపాన్ ఆటగాడు కీ నిషికోరి సంచలనం సృష్టించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్‌ను 6-4, 1-6, 7-6 (7-4), 6-3తో మట్టి కరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
న్యూయార్క్: జపాన్ ఆటగాడు కీ నిషికోరి సంచలనం సృష్టించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్‌ను 6-4, 1-6, 7-6 (7-4), 6-3తో మట్టి కరిపించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
దీంతో యూఎస్ ఓపెన్‌లో 96 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన తొలి జపాన్ ఆటగాడయ్యాడు. గత రెండుసార్లు రన్నరప్ అయిన జొకోవిచ్ రెండో సెట్‌ను గెలుచుకున్నా.. హోరాహోరీగా సాగిన మూడో సెట్‌ను కోల్పోయాడు. నాలుగో సెట్‌లో ఆరంభం నుంచే అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు.