French Open tournament
-
French Open 2021: నాదల్ ఓటమి.. ఫైనల్లో జకోవిచ్
పారిస్: ప్రపంచం నెంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ టోర్నీలో అడుగుపెట్టాడు. 13 సార్లు ఛాంపియన్ అయిన రఫెల్ నాదల్‌ను జకోవిచ్ చిత్తుగా ఓడించాడు. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి రొలాండ్‌గారోస్‌లో జరిగిన మ్యాచ్‌లో జకోవిచ్ 3-6, 6-3, 7-6(7/4), 6-2 సెట్స్‌తో నాదల్‌ను ఓడించడం విశేషం. నాదల్‌కి గత పదహారేళ్లలో(2005 నుంచి) క్లే కోర్టు గ్రాండ్ స్లామ్లో ఆడిన 108 మ్యాచ్‌లలో ఇది మూడో ఓటమి కాగా, 14 సెమీ ఫైనల్స్‌లో మొదటి ఓటమి. అంతేకాదు ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌ను రెండుసార్లు ఓడించిన ఏకైక వ్యక్తి జకోవిచ్ కావడం విశేషం. ఇక రోలాండ్ గారోస్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదటి సెట్‌నే కోల్పోవడం రఫెల్ నాదల్‌కి ఇదే ఫస్ట్ టైం. జకోవిచ్ గనుక ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిస్తే.. 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దక్కించుకోవడంతో పాటు నాలుగు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ రెండేసి సార్లు గెల్చుకున్న ప్లేయర్‌గా రికార్డు సొంతం చేసుకుంటాడు. కాగా, ఓటమిపై నాదల్ స్పందిస్తూ. ‘బెస్ట్ ప్లేయర్ గెలిచాడు’ అని జకోవిచ్‌పై పొగడ్తలు గుప్పించగా. 34 ఏళ్ల సెర్బియన్ ప్లేయర్ జకోవిచ్ తన విక్టరీలలో ఇది గొప్పదని చెప్పుకొచ్చాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 4️⃣ hours and 1️⃣1️⃣ minutes You've earned that smile @DjokerNole!#RolandGarros pic.twitter.com/75wWsWNUwY — Roland-Garros (@rolandgarros) June 11, 2021 ఇక జకోవిచ్ ఆదివారం జరగబోయే ఫైనల్మ్యాచ్లో స్టెఫనోస్ సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మొట్టమొదటి గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్ కావడం విశేషం. గతంలో మూడుసార్లు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన ఈ యువ కెరటం.. శుక్రవారం జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడి మూడున్నర గంటల హోరాహోరీ పోరు తర్వాత విజయం సాధించాడు. చదవండి: ట్రాప్ చేసి వీడియో తీయమన్నారు -
ఎదురు లేని నాదల్
ఎర్రమట్టిపై రాఫెల్ నాదల్ మరోసారి ఎదురులేని ప్రదర్శన కనబర్చాడు... 13వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గే క్రమంలో నాదల్ తుది పోరుకు అర్హత సాధించాడు. సెమీస్‌లో అతని జోరు ముందు ష్వార్ట్‌జ్‌మన్ నిలవలేకపోయాడు. ఇటీవలే రోమ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లో నాదల్‌పై సంచలన విజయం సాధించిన అర్జెంటీనా ఆటగాడు గ్రాండ్‌స్లామ్ పోరులో మాత్రం తలవంచక తప్పలేదు. పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ విజయ యాత్ర కొనసాగుతోంది. టైటిల్ సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన అతను ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన సెమీస్‌లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–3, 7–6 (7/0)తో 12వ సీడ్ డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)ను ఓడించాడు. మొత్తం 3 గంటల 9 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు ఏకపక్షంగా సాగగా...చివరి సెట్లో మాత్రం ష్వార్ట్‌జ్‌మన్ కొంత పోటీనివ్వగలిగాడు. అయితే తుది ఫలితం మాత్రం నాదల్కు అనుకూలంగానే వచ్చింది. 3 ఏస్‌లు కొట్టిన అతను ఒక్క డబుల్‌ఫాల్ట్ కూడా చేయలేదు. మ్యాచ్‌లో నాదల్ 38 విన్నర్లు కొట్టాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్కు ఇది 99వ విజయం కావడం విశేషం. మరో మ్యాచ్ గెలిస్తే అతను 100వ విజయంతో పాటు 13వ సారి టైటిల్‌ను అందుకుంటాడు. ఇక్కడ 12 సార్లు ఫైనల్ చేరిన అతను 12 సార్లూ విజేతగా నిలిచాడు. టైబ్రేక్‌లో జోరు... మొదటి సెట్లో తన సర్వీస్‌ను కాపాడుకుంటూ ఒక సారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ 4–1తో ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత ష్వార్ట్‌జ్‌మన్ కాస్త పోరాడి ఆధిక్యాన్ని 3–5కు తగ్గించగలిగినా, తర్వాతి గేమ్‌ను గెలుచుకొని నాదల్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్ కూడా దాదాపు ఇదే తరహాలో సాగింది. అయితే తొలి సెట్‌కంటే 13 నిమిషాలు వేగంగా ఈ సెట్‌ను స్పెయిన్ దిగ్గజం ముగించగలిగాడు. మూడో సెట్‌ను కూడా ఒక దశలో వరల్డ్ నంబర్ 2 సునాయాసంగా గెలుచుకుంటాడని అనిపించింది. అయితే అర్జెంటీనా ఆటగాడు తన సర్వశక్తులూ ఒడ్డి ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేశాడు. నాదల్ 4–2తో ఉన్న దశనుంచి అతను చెలరేగడంతో స్కోరు 5–5కు చేరింది. ఈ సమయంలో నాదల్ కొంత ఒత్తిడికి లోనయ్యాడు. పది నిమిషాలకు పైగా సాగిన తర్వాతి గేమ్‌లో అతను అద్భుతమైన ఫోర్‌హ్యాండ్‌లతో మూడు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్నాడు. అయితే ష్వార్ట్‌జ్‌మన్ 6–6తో సమం చేయడంతో టైబ్రేకర్ అనివార్యమైంది. ఇక్కడ నాదల్ తన స్థాయి ఏమిటో చూపించాడు. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా 7 గేమ్‌లు గెలిచి ఫైనల్ చేరాడు. -
అయ్యో హలెప్...
పారిస్: పలువురు స్టార్ క్రీడాకారిణుల గైర్హాజరీలో కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు వచ్చిన సదవకాశాన్ని టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ సిమోనా హలెప్ (రొమేనియా) చేజార్చుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో ఈ మాజీ చాంపియన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించి ఆశ్చర్యపరిచింది. పోలాండ్ టీనేజర్ ఇగా స్వియాటెక్ కేవలం 68 నిమిషాల్లో 6–1, 6–2తో హలెప్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించింది. గత ఏడాది ఇదే టోర్నీలో హలెప్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 1–6, 0–6తో ఓడిపోయింది. ఏడాది తిరిగేలోపు అదే వేదికపై, ప్రిక్వార్టర్ ఫైనల్లోనే హలెప్‌ను స్వియాటెక్ చిత్తు చేయడం విశేషం. ఈ గెలుపుతో 19 ఏళ్ల స్వియాటెక్ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది. స్వియాటెక్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో హలెప్ ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశాన్ని సంపాదించకపోవడం గమనార్హం. మరోవైపు స్వియాటెక్ నాలుగుసార్లు హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. క్వాలిఫయర్ల హవా... మహిళల సింగిల్స్ విభాగంలో ఇద్దరు క్వాలిఫయర్లు మార్టినా ట్రెవిసాన్ (ఇటలీ), నదియా పొడొరోస్కా (అర్జెంటీనా) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో 159వ ర్యాంకర్ ట్రెవిసాన్ 6–4, 6–4తో ఐదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)ను కంగుతినిపించగా... 131వ ర్యాంకర్ నదియా పొడొరోస్కా 2–6, 6–2, 6–3తో బార్బరా క్రాయికోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గారు. తద్వారా 2012 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన క్వాలిఫయర్లుగా గుర్తింపు పొందారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించి మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఎదురులేని నాదల్... కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురిపెట్టిన పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–1, 6–1, 6–2తో సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై అలవోకగా గెలిచాడు. మరోవైపు ఇటలీకి చెందిన 75వ ర్యాంకర్ జానిక్ సినెర్ సంచలనం సృష్టించాడు. ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల సినెర్ 6–3, 6–3, 4–6, 6–3తో గెలుపొంది రాఫెల్ నాదల్ (2005లో) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ అరంగేట్రంలోనే క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో సినెర్ ఆడనున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్, గతేడాది రన్నరప్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 3 గంటల 32 నిమిషాల్లో 6–4, 6–4, 5–7, 3–6, 6–3తో 239వ ర్యాంకర్ హుగో గస్టాన్ (ఫ్రాన్స్)పై గెలిచి వరుసగా ఐదో సంవత్సరం క్వార్టర్ ఫైనల్ చేరాడు. -
ఒస్టాపెంకో ముందంజ
మూడేళ్ల క్రితం అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి సంచలన ప్రదర్శనతో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన జెలెనా ఒస్టాపెంకో తనకు అచ్చొచ్చిన వేదికగా మళ్లీ రాణిస్తోంది. 2020లో కూడా అన్‌సీడెడ్‌గా వచ్చిన ఈ లాత్వియా అమ్మాయి టోర్నీ రెండో సీడ్ ప్లిస్కోవాకు షాక్ ఇచ్చి మరో అడుగు ముందుకు వేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సోఫియా కెనిన్ కొంత పోరాడి మూడో రౌండ్‌కు చేరగా, పురుషుల విభాగంలో నంబర్‌వన్ జొకోవిచ్ కూడా తన జోరు ప్రదర్శించగా, గురువారం టోర్నీలో ఇతర సంచలనాలేమీ నమోదు కాలేదు. పారిస్: మాజీ చాంపియన్, అన్‌సీడెడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మూడో రౌండ్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఒస్టాపెంకో 6–4, 6–2 స్కోరుతో 2వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసిన ఆమె 27 విన్నర్లు కొట్టింది. ఇటీవల జరిగిన రోమ్ ఓపెన్‌కు ఫైనల్‌కు చేరి గాయంతో తప్పుకున్న ప్రపంచ 8వ ర్యాంకర్ ప్లిస్కోవా 69 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. నాలుగో సీడ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ కూడా ముందంజ వేసింది. రెండో రౌండ్లో ఆమె 3–6, 6–3, 6–2 తేడాతో అనా బోగ్డెన్ (రొమేనియా)ను ఓడించింది. ఇతర మహిళల సింగిల్స్ మ్యాచ్‌లలో ఏడో సీడ్ పెట్రో క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3తో జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ అరైనా సబలెంకా (బెలారస్)పై, పావ్లా బడోసా (స్పెయిన్) 6–4, 4–6, 6–2తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై విజయం సాధించారు. ఓటమి తప్పించుకున్న జ్వెరేవ్... పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ (జర్మనీ)కి అదృష్టం కలిసొచ్చింది. పియరీ హ్యూజెస్ హెర్బర్ట్ (ఫ్రాన్స్)తో ఐదు సెట్ల పాటు జరిగిన పోరులో అతను చివరకు విజయం సాధించి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 59 నిమిషాల పాటు సాగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో జ్వెరేవ్ 2–6, 6–4, 7–6 (7/5), 4–6, 6–4తో గెలుపొందాడు. 45 విన్నర్లు కొట్టిన జ్వెరేవ్ 10 ఏస్‌లు సంధించాడు. 3 గంటల 53 నిమిషాలు సాగిన మరో మ్యాచ్‌లో స్టెఫానో ట్రవాగ్లియా (ఇటలీ) 6–4, 2–6, 7–6 (9/7), 4–6, 6–2తో నిషికొరి (జపాన్)పై విజయం సాధించాడు. టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు రెండో రౌండ్లో ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. కేవలం 83 నిమిషాల్లో ముగిసి మ్యాచ్‌లో జొకోవిచ్ 6–1, 6–2, 6–2తో బెరాంకిస్ (లిథువేనియా)ను చిత్తుగా ఓడించి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్) 6–1, 6–4, 6–2తో పాబ్లో క్వాస్ (ఉరుగ్వే)ను ఓడించి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. దివిజ్ జోడి ఓటమి... పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు దివిజ్ శరణ్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. శరణ్–సూన్‌వూ క్వాన్ (కొరియా) జంట 2–6, 6–4, 4–6తో ఫ్రాంకో స్కుగర్ (క్రొయేషియా)–అస్టిన్ క్రాజిసెక్ (అమెరికా) చేతిలో పరాజయంపాలైంది. -
మెద్వెదేవ్‌కు చుక్కెదురు
పారిస్: హార్డ్ కోర్టులపై అద్భుతంగా ఆడే రష్యా యువతార డానిల్ మెద్వెదేవ్ ఎర్రమట్టి కోర్టులపై మరోసారి తేలిపోయాడు. ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్ మెద్వెదేవ్ వరుసగా నాలుగో ఏడాదీ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 63వ ర్యాంకర్ మార్టన్ ఫుచోవిచ్ (హంగేరి) 6–4, 7–6 (7/3), 2–6, 6–1తో మెద్వెదేవ్‌ను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 3 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫుచోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) అలవోక విజయంతో శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో జొకోవిచ్ 6–0, 6–2, 6–3తో మికెల్ వైమెర్ (స్వీడన్)ను ఓడించాడు. ఈ ఏడాది జొకోవిచ్‌కిది 32వ విజయం కావడం విశేషం. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో 13వ సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) 3 గంటల 17 నిమిషాల్లో 6–7 (5/7), 5–7 (4/7), 7–5, 6–4, 6–3తో స్యామ్ క్వెరీ (అమెరికా)పై అద్భుత విజయం సాధించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయిన రుబ్లెవ్ ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకొని నెగ్గడం విశేషం. ప్లిస్కోవా ముందంజ... మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) శ్రమించి రెండో రౌండ్లోకి చేరారు. ప్లిస్కోవా 2 గంటల 15 నిమిషాల్లో 6–7 (9/11), 6–2, 6–4తో మాయర్ షెరీఫ్ (ఈజిప్ట్)పై, సోఫియా గంటా 58 నిమిషాల్లో 6–4, 3–6, 6–3తో లుద్మిలా సమ్సోనోవా (రష్యా)పై నెగ్గారు. ఇద్దరు క్వాలిఫయర్లు ఇరీనా బారా (రొమేనియా) 6–3, 6–4తో 26వ సీడ్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై... 17 ఏళ్ల క్లారా టౌసన్ (డెన్మార్క్) 2 గంటల 45 నిమిషాల్లో 6–4, 3–6, 9–7తో 21వ సీడ్ జెన్నిఫర్ బ్రేడీ (అమెరికా)పై సంచలన విజయాలు సాధించారు. 6 గంటల 5 నిమిషాల్లో... సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతోన్న ఇటలీ క్వాలిఫయర్ ఆటగాడు లొరెంజో గస్టినో అద్భుతం చేశాడు. 6 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ మారథాన్ మ్యాచ్‌లో గస్టినో 0–6, 7–6 (9/7), 7–6 (7/3), 2–6, 18–16తో కొరెంటిన్ ముతె (ఫ్రాన్స్)పై గెలిచాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్లోకి చేరాడు. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్‌గా ఇది నిలిచింది. 2004 ఫ్రెంచ్ ఓపెన్‌లో అర్నాడ్ క్లెమెంట్, ఫాబ్రిస్ సాంతోరో మ్యాచ్ 6 గంటల 33 నిమిషాలు జరిగింది. ముతె, గస్టినో మధ్య జరిగిన మ్యాచ్‌లో 22 బ్రేక్ పాయింట్లు నమోదయ్యాయి. గస్టినో 96, ముతె 88 అనవసర తప్పిదాలు చేశారు. చివరి సెట్ ఒక్కటే 3 గంటల 29 నిమిషాలు సాగడం విశేషం. -
సీడెడ్లకు చుక్కెదురు
పారిస్: వరుసగా రెండో రోజూ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. గత ఏడాది రన్నరప్, 15వ సీడ్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), 12వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), 22వ సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్), 28వ సీడ్ స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–1, 6–2తో వొండ్రుసోవాను బోల్తా కొట్టించింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో షుయె జాంగ్ (చైనా) 6–3, 7–6 (7/2)తో కీస్పై... క్రిస్టినా మెకేల్ (అమెరికా) 6–2, 6–4తో ముకోవాపై... పావ్లీచెంకోవా (రష్యా) 6–1, 2–6, 6–1తో కుజ్నెత్సోవాపై సంచలన విజయాలు సాధించారు. మరోవైపు టాప్–10లోని నలుగురు క్రీడాకారిణులు రెండో రౌండ్లో కి అడుగుపెట్టారు. ఆరో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 7–6 (7/2), 6–0తో క్రిస్టీ ఆన్ (అమెరికా)పై, ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 7–5తో ఒసీన్ డోడిన్ (ఫ్రాన్స్)పై, ఐదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) 2–6, 6–2, 6–0తో జవాత్స్కా (ఉక్రెయిన్)పై, మూడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 7–6 (7/2), 6–4తో వర్వరా గ్రషెవా (రష్యా) పై గెలిచారు. 2016 చాంపియన్ ముగురుజా 7–5, 4–6, 8–6తో 81వ ర్యాంకర్ తమారా జిదాన్సెక్ (స్లొవేకియా)పై శ్రమించి గెలిచింది. నాదల్ శుభారంభం... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ నాదల్ (స్పెయిన్), గతేడాది రన్నరప్ థీమ్ (ఆస్ట్రియా) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో నాదల్ 6–4, 6–4, 6–2తో జెరాసిమోవ్ (బెలారస్)పై, థీమ్ 6–4, 6–3, 6–3తో సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గారు. మరోవైపు ఎనిమిదో సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 4–6, 5–7, 6–3, 3–6తో బుబ్లిక్ (కజకిస్తాన్) చేతిలో, 14వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ) 5–7, 6–3, 6–7 (1/7), 0–6తో కుకుష్కిన్ (కజకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. -
సంచలనంతో షురూ...
పారిస్: ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలనాలతో మొదలైంది. ఆదివారం ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ యోహానా కొంటా (బ్రిటన్), ప్రపంచ మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా), 17వ సీడ్ అనెట్ కొంటావె (ఎస్తోనియా), 24వ సీడ్ డయానా యాస్ట్రెమ్స్కా (ఉక్రెయిన్)... పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం), ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అమెరికా టీనేజ్ సంచలనం, 16 ఏళ్ల కోరి గాఫ్ గంటా 41 నిమిషాల్లో 6–3, 6–3తో యోహానా కొంటాను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. కరోలినా షిమెద్లోవా (స్లొవేకియా) 6–4, 6–4తో వీనస్‌పై... దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా) 6–4, 6–3తో యాస్ట్రెమ్స్కాపై, కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–4, 3–6, 6–4తో కొంటావెపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. 1997 నుంచి ఈ టోర్నీలో ఆడుతోన్న 40 ఏళ్ల వీనస్ వరుసగా మూడో ఏడాది తొలి రౌండ్లోనే వెనుదిరగడం గమనార్హం. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ హలెప్ (రొమేనియా) 6–4, 6–0తో సొరిబెస్ టోర్మో (స్పెయిన్)పై, మాజీ నంబర్‌వన్, పదో సీడ్ అజరెంకా (బెలారస్) 6–1, 6–2తో డాంకా కొవినిచ్ (మాంటెనిగ్రో)పై, 16వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం) 6–2, 6–3తో గాస్పర్యాన్ (రష్యా)పై విజయం సాధించారు. వావ్రింకా ముందంజ... పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో 16వ సీడ్ వావ్రింకా 6–1, 6–3, 6–2తో మాజీ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలిచాడు. మరోవైపు 19 ఏళ్ల జానిక్ సినెర్ (ఇటలీ) 7–5, 6–0, 6–3తో 11వ సీడ్ డేవిడ్ గాఫిన్‌పై సంచలన విజయం సాధించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 23వ సీడ్ బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్) 7–5, 6–4, 6–4తో సూన్వున్ క్వాన్ (కొరియా)పై, నిషికోరి (జపాన్) 1–6, 6–1, 7–6 (7/3), 1–6, 6–4తో 32వ సీడ్ ఇవాన్స్ (బ్రిటన్)పై, గాంబోస్ (స్లొవేకియా) 6–4, 3–6, 6–3, 6–4తో 24వ సీడ్ బొర్నా చోరిచ్ (క్రొయేషియా)పై గెలిచారు. -
ఫెడరర్ x నాదల్
పారిస్: తమ విజయ పరంపర కొనసాగిస్తూ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో నాదల్ (స్పెయిన్) 6–1, 6–1, 6–3తో ఏడో సీడ్ నిషికోరి (జపాన్)ను... మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7–6 (7/4), 4–6, 7–6 (7/5), 6–4తో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను ఓడించారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో వీరిద్దరు తలపడనుండటం 2011 తర్వాత ఇదే తొలిసారి కానుంది. ఓవరాల్‌గా వీరి ద్దరు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఐదుసార్లు తలపడగా... ఐదుసార్లూ నాదల్‌నే విజయం వరించింది. మహిళల సిం గిల్స్ క్వార్టర్ ఫైనల్లో జొహనా కొంటా (బ్రిటన్) 6–1, 6–4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచింది. 1983లో జో డ్యూరీ తర్వాత ఈ టోర్నీలో సెమీస్ చేరిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. -
క్వార్టర్స్‌లో ఫెడరర్, నాదల్
పారిస్: మూడేళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొంటున్న మాజీ విజేత రోజర్ ఫెడరర్... రికార్డుస్థాయిలో 12వసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న రాఫెల్ నాదల్... సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకునే దిశగా మరో అడుగు వేశారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 37 ఏళ్ల ఫెడరర్ 6–2, 6–3, 6–3తో లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)పై గెలుపొందగా... నాదల్ 6–2, 6–3, 6–3తో యువాన్ ఇగ్నాసియో లొండెరో (అర్జెంటీనా)ను ఓడించాడు. ఈ గెలుపుతో ఫెడరర్ 1991 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 1991లో అమెరికా దిగ్గజం జిమ్మీ కానర్స్ 39 ఏళ్ల వయసులో యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరాడు. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులపై గెలిస్తే ఫెడరర్, నాదల్ సెమీఫైనల్లో తలపడతారు. 5 గంటల 9 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7–6 (8/6), 5–7, 6–4, 3–6, 8–6తో ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్ విభాగంలో పెట్రా మార్టిక్ (క్రొయేషియా), మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), జొహన కొంటా (బ్రిటన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మార్టిక్ 5–7, 6–2, 6–4తో కయి కనెపి (ఎస్తోనియా)పై నెగ్గగా... వొండ్రుసోవా 6–2, 6–0తో 12వ సీడ్ సెవస్తోవా (లాత్వియా)ను బోల్తా కొట్టించింది. జొహన కొంటా 6–2, 6–4తో డొనా వెకిచ్ (సెర్బియా)పై గెలిచి ఫ్రెంచ్ ఓపెన్‌లో 36 ఏళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి బ్రిటన్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. చివరిసారి బ్రిటన్ తరఫున జో డ్యూరీ 1983లో ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మరియస్ కోపిల్ (రొమేనియా) జంట 6–1, 5–7, 6–7 (8/10)తో దుసాన్ లాజోవిచ్–టిప్సరెవిచ్ (సెర్బియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ఒసాకా శ్రమించి...
పారిస్: వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన జపాన్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ నయోమి ఒసాకా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. గతేడాది యూఎస్ ఓపెన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన ఒసాకా ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఒసాకా 4–6, 7–5, 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై కష్టపడి గెలిచింది. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా ఆరు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఆమె తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. తొలి సెట్ చేజార్చుకున్న ఒసాకా రెండో సెట్లో కోలుకుంది. కీలకదశలో తప్పిదాలు చేయకుండా సంయమనంతో ఆడి అనుకున్న ఫలితాన్ని సాధించింది. 2005లో లిండ్సే డావెన్‌పోర్ట్ (అమెరికా) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తొలి సెట్‌ను కోల్పోయాక విజయం సాధించిన రెండో టాప్ సీడ్ ప్లేయర్‌గా ఒసాకా గుర్తింపు పొందింది. మూడో రౌండ్లో కాటరీనా సినియకోవా (చెక్ రిపబ్లిక్)తో ఒసాకా ఆడుతుంది. రెండో రౌండ్లో సినియకోవా 3 గంటల 10 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 7–6 (7/5), 6–7 (8/10), 6–4తో మరియా సకారి (గ్రీస్)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో 17 ఏళ్ల అమెరికా అమ్మాయి అమండా అనిసిమోవా 6–4, 6–2తో 11వ సీడ్ ఆర్యాన సబలెంక (బెలారస్)పై సంచలన విజయం సాధించింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, పదో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6–3, 6–2తో కురుమి నారా (జపాన్)పై, 15వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 4–6, 6–4, 6–4తో సీగ్మండ్ (జర్మనీ)పై గెలిచారు. జొకోవిచ్ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో థీమ్ 6–3, 6–7 (6/8), 6–3, 7–5తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై, జొకోవిచ్ 6–1, 6–4, 6–3తో లాక్సోనెన్ (స్విట్జర్లాండ్)పై, జ్వెరెవ్ 6–1, 6–3, 7–6 (7/3)తో వైమెర్ (స్వీడన్)పై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)–అయోయామ (జపాన్) ద్వయం 3–6, 6–2, 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో కిచెనోక్ (ఉక్రెయిన్)–సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో) జంట చేతిలో ఓడిపోయింది. -
మూడో రౌండ్లో నాదల్
పారిస్: డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో నాదల్ 6–1, 6–2, 6–4తో యానిక్ మాడెన్ (జర్మనీ)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–4, 6–3, 6–4తో ఆస్కార్ ఒట్టె (జర్మనీ)పై, ఏడో సీడ్ నిషికోరి (జపాన్) 4–6, 6–4, 6–4, 6–4తో సోంగా (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 4–6, 6–0, 6–3, 7–5తో డెలియన్ (బొలీవియా)పై గెలిచారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–1, 7–6 (7/3)తో సోరిబెస్ (స్పెయిన్)పై, రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో కుకోవా (స్లొవేకియా)పై, 12వ సీడ్ సెవస్తోవా (లాత్వియా) 6–2, 6–4తో మినెల్లా (లక్సెంబర్గ్)పై గెలిచారు. దివిజ్ జంట శుభారంభం: పురుషుల డబుల్స్ విభాగంలో భారత డబుల్స్ స్టార్ ఆటగాళ్లు దివిజ్ శరణ్, రోహన్ బోపన్న జోడీలు శుభారంభం చేశాయి. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో దివిజ్–డెమోలైనర్ (బ్రెజిల్) ద్వయం 6–3, 4–6, 6–2తో ఫక్సోవిక్స్ (హంగేరి)–లిండ్‌స్టెడ్ (స్వీడన్) జోడీపై... బోపన్న–మరియస్ కోపిల్ (రొమేనియా) జంట 6–3, 7–6 (7/4)తో ఆరో సీడ్ మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)–క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జోడీపై గెలిచి రెండో రౌండ్‌కు చేరాయి. -
బాల్‌బాయ్ కల నెరవేర్చాడు..!
పారిస్: ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వరల్డ్ నంబర్ వన్ రఫెల్ నాదల్.. బాల్‌బాయ్‌తో కలిసి టెన్నిస్ ఆడి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. తద్వారా స్పెయిన్ బుల్ నాదల్ గొప్ప ప్లేయరే కాదు.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని కూడా నిరూపించుకున్నాడు. ఆదివారం 32వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న నాదల్.. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో దూసుకెళ్తున్నాడు. మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు రిచర్డ్ గాస్కెట్‌పై 6-3, 6-2, 6-2తో సునాయాసంగా గెలిచి నాలుగో రౌండ్లో అడుగుపెట్టాడు నాదల్. అయితే మ్యాచ్ తర్వాత అక్కడి బాల్‌బాయ్ కలను సాకారం చేశాడు. కోర్టు ప్రెజెంటర్ అతని ఇంటర్వ్యూ తీసుకుంటున్న సందర్భంగా మీకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారుగానీ.. ఇక్కడున్న మీ అతిపెద్ద అభిమాని.. మీతో ఒక్క బాలైనా ఆడాలనుకుంటున్నాడు అని నదాల్‌కు స్పష్టం చేశారు. దీనికి రఫా కూడా ఓకే చెప్పాడు. ఆ బాల్‌బాయ్ దగ్గరికెళ్లి తన రాకెట్ ఇచ్చి ఆడదాం పదా అంటూ ప్రోత్సహించాడు. తన అభిమాన ప్లేయర్‌తో అతనికెంతో ఇష్టమైన క్లే కోర్టుపై ఆడే అవకాశం రావడంతో ఆ బాల్‌బాయ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అతను కూడా ఓ పక్కా ప్రొఫెషనల్ ప్లేయర్‌లాగే ఆడాడు. ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో అదరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. -
బాల్‌బాయ్ కలను సాకారం చేశాడు
-
వొజ్నియాకి అలవోకగా...
పారిస్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన డెన్మార్క్ స్టార్ కరోలైన్ వొజ్నియాకి అదే జోరును ఫ్రెంచ్ ఓపెన్‌లో కొనసాగిస్తోంది. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఫ్రెంచ్ ఓపెన్‌లో వొజ్నియాకి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. గార్సియా పెరెజ్ (స్పెయిన్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ వొజ్నియాకి 6–1, 6–0తో అలవోకగా గెలిచింది. 51 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో వొజ్నియాకి తన ప్రత్యర్థికి కేవలం ఒక గేమ్ మాత్రమే కోల్పోయింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–4తో కుజ్మోవా (స్లొవేకియా)పై, ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–0, 6–4తో అరూబెరెనా (స్పెయిన్)పై నెగ్గి మూడో రౌండ్లో అడుగు పెట్టారు. శ్రమించిన హలెప్... మరోవైపు టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రొమేనియా)కు తొలి రౌండ్లోనే ఊహించని ప్రతిఘటన ఎదురైంది. అలీసన్ రిస్కీ (అమెరికా)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో హలెప్ 2–6, 6–1, 6–1తో విజయం సాధించి ఊరట చెందింది. 2014, 2017లలో రన్నరప్‌గా నిలిచిన హలెప్ తొలి సెట్లో 0–5తో వెనుకబడింది. ఆ తర్వాత రెండు గేమ్‌లు గెల్చుకున్నప్పటికీ తొలి సెట్‌ను దక్కించుకోలేకపోయింది. అయితే రెండో సెట్లో ఈ రొమేనియా స్టార్ పుంజుకుంది. నాలుగుసార్లు రిస్కీ సర్వీస్‌ను బ్రేక్ చేసి అదే జోరులో సెట్‌ను సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో సెట్లోనూ హలెప్ దూకుడు కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మంగళవారమే హలెప్ తన తొలి రౌండ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నా వర్షం కారణంగా ఆమె మ్యాచ్‌ను బుధవారానికి మార్చారు. గట్టెక్కిన జ్వెరెవ్ పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), నాలుగో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), 19వ సీడ్ నిషికోరి (జపాన్) ఐదు సెట్ల పోరాటంలో గట్టెక్కారు. రెండో రౌండ్లో జ్వెరెవ్ 2–6, 7–5, 4–6, 6–1, 6–2తో లాజోవిక్ (సెర్బియా)పై, దిమిత్రోవ్ 6–7 (2/7), 6–4, 4–6, 6–4, 10–8తో డొనాల్డ్సన్ (అమెరికా)పై, నిషికోరి 6–3, 2–6, 4–6, 6–2, 6–3తో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై కష్టపడి గెలిచారు. మాజీ చాంపియన్ జొకోవిచ్ 7–6 (7/1), 6–4, 6–4తో మునార్ (స్పెయిన్)పై, ఎనిమిదో సీడ్ గాఫిన్ (బెల్జియం) 7–5, 6–0, 6–1తో మూటెట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. 12వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 6–1, 6–7 (3/7), 4–6, 1–6తో సిమోన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. -
సెరెనా శుభారంభం
పారిస్: తల్లి అయ్యాక ఆడుతున్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ శుభారంభం చేసింది. క్రిస్టినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 36 ఏళ్ల సెరెనా 7–6 (7/4), 6–4తో గెలుపొందింది. గర్భవతిగానే 2017 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన సెరెనా ఆ తర్వాత ఆటకు విరామం ఇచ్చింది. గతేడాది సెప్టెంబరులో పాపకు జన్మనిచ్చాక ఇటీవలే మళ్లీ రాకెట్ పట్టింది. ప్లిస్కోవాతో జరిగిన మ్యాచ్‌లో తొలి సెట్ 12వ గేమ్‌లో తన సర్వీస్‌లో బ్రేక్ పాయింట్ కాపాడుకున్న సెరెనా టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. రెండో సెట్లో ఒకదశలో 0–3తో వెనుకబడిన ఈ మాజీ చాంపియన్ వెంటనే తేరుకొని స్కోరును సమం చేసింది. ఆ తర్వాత పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) 6–1, 4–6, 6–3తో హోగెన్కాంప్ (నెదర్లాండ్స్)పై, మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్) 7–6 (7/0), 6–2తో స్వెత్లానా కుజ్నెత్సోవా (రష్యా) పై, ఏడో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–1, 6–0తో దువాన్ (చైనా)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ తొలి రౌండ్లో 6–4, 6–3, 7–6 (11/9)తో బొలెలీ (ఇటలీ)పై, మూడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6–3, 7–5, 7–6 (7/4)తో డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై నెగ్గి రెండో రౌండ్‌కు చేరారు. 14వ సీడ్ జాక్ సాక్ (అమెరికా) 7–6 (7/4), 6–2, 6–4, 6–7 (5/7), 3–6తో జర్గెన్ జాప్ (ఎస్తోనియా) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కు చెందిన యూకీ బాంబ్రీ 4–6, 4–6, 1–6తో రూబెన్ బెమెల్మాన్స్ (బెల్జియం) చేతిలో ఓటమి పాలయ్యాడు. అందుకే ‘క్యాట్ సూట్’... అమ్మగా మారిన తర్వాతి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ బరిలో నిలిచిన సెరెనా విలియమ్స్ వస్త్రధారణ ప్రత్యేకంగా నిలిచింది. నైకీ ప్రత్యేకంగా తయారు చేయించిన నలుపు రంగు ‘క్యాట్‌సూట్’లో ఆమె మైదానంలో అడుగు పెట్టి విజయాన్ని అందుకుంది. గతంలోనూ సెరెనా ఇలాంటి డ్రెస్ ధరించినా... కూతురు పుట్టిన తర్వాత తొలి మెగా టోర్నీ కావడంతో అది చర్చనీయాంశమైంది. దీనిపై మాట్లాడుతూ...‘అక్కడ ఉన్న అమ్మలందరి కోసమే ఇది. అందరూ గర్భవతిగా కఠిన పరీక్షను ఎదుర్కొని నిలిచినవారే. ఆ తర్వాత మళ్లీ తిరిగొచ్చి అంతే పదునుగా ఉండేందుకు ప్రయత్నించేవారే. నా వస్త్రధారణ అలాంటివారి ఆలోచనలను ప్రతిబింబిస్తుందని భావిస్తున్నా...కాదంటారా? ఈ డ్రెస్‌లో యోధురాలైన మహరాణిలా నన్ను నేను ఊహించుకుంటున్నా. నా కలల ప్రపంచంలో సూపర్ హీరోను కావాలనుకున్నా. ఇది వేసుకుంటే సూపర్ హీరోలా అనిపిస్తోంది’ అని సెరెనా విలియమ్స్ వ్యాఖ్యానించింది. -
వావ్రింకా ఇంటిముఖం...
తొలి రోజు మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఒస్టాపెంకో తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... రెండోరోజు పురుషుల సింగిల్స్‌లో గతేడాది రన్నరప్, 2015 చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా మొదటి రౌండ్లోనే వెనుదిరిగాడు. ప్రపంచ 67వ ర్యాంకర్ గిలెర్మో గార్సియా లోపెజ్ అద్వితీయ ఆటతీరు కనబరిచి ఐదు సెట్ల పోరాటంలో వావ్రింకాను బోల్తా కొట్టించాడు. ఈ ఓటమితో జూన్ రెండో వారంలో విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వావ్రింకా ప్రస్తుత 30వ ర్యాంక్ నుంచి దిగజారి 256వ ర్యాంక్‌కు పడిపోనున్నాడు. మరోవైపు మాజీ చాంపియన్, 20వ సీడ్ నొవాక్ జొకోవిచ్, ఏడో సీడ్ డొమినిక్ థీమ్ అలవోక విజయాలతో రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. పారిస్: కొంతకాలంగా గాయాలతో సతమతమవుతూ ఫామ్ కోల్పోయిన స్విట్జర్లాండ్ అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకాకు ఫ్రెంచ్ ఓపెన్‌లో చేదు ఫలితం ఎదురైంది. గతేడాది రన్నరప్‌గా నిలిచిన అతను ఈసారి తొలి రౌండ్లోనే చేతులెత్తేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 67వ ర్యాంకర్ గిలెర్మో గార్సియా లోపెజ్ (స్పెయిన్) 6–2, 3–6, 4–6, 7–6 (7/5), 6–3తో వావ్రింకాను ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. 3 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వావ్రింకా ఐదు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. అయితే ఊహించని రీతిలో ఏకంగా 72 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఐదుసార్లు వావ్రింకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన లోపెజ్ 40 అనవసర తప్పిదాలు చేశాడు. ‘ఈ ఓటమితో నా ర్యాంక్ ఘోరంగా పడిపోతుందని తెలుసు. అయితే దీనిపై నాకేమీ ఇబ్బంది లేదు. మళ్లీ ఫామ్‌లోకి రావడానికి కాస్త సమయం ఎక్కువ పడుతుంది’ అని 33 ఏళ్ల వావ్రింకా వ్యాఖ్యానించాడు. ఇతర పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 20వ సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–4తో దుత్రా సిల్వా (బ్రెజిల్)పై, డొమినిక్ థీమ్ 6–2, 6–4, 6–1తో ఇవాష్కా (బెలారస్)పై, 12వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 6–1, 6–2, 7–6 (8/6)తో టియాఫో (అమెరికా)పై గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించారు. వొజ్నియాకి ముందంజ... మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోకి చేరగా... 20వ సీడ్ సెవస్తోవా (లాత్వియా) తొలి రౌండ్లో పరాజయం చవి చూసింది. వొజ్నియాకి 7–6 (7/2), 6–1తో కోలిన్స్ (అమెరికా)పై, క్విటోవా 3–6, 6–1, 7–5తో వెరోనికా (పరాగ్వే)పై గెలిచారు. సెవస్తోవా 6–4, 1–6, 3–6తో మరీనో (కొలంబియా) చేతిలో ఓడింది. -
మెయిన్ ‘డ్రా’కు విజయం దూరంలో...
ఫ్రెంచ్ ఓపెన్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించేందుకు భారత టెన్నిస్ యువతార ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మరో విజయం దూరంలో ఉన్నాడు. పారిస్‌లో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో అతను మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్)తో బుధవారం జరిగిన రెండో రౌండ్లో ప్రజ్నేశ్ 6–4, 6–1తో గెలుపొందాడు. ఇలియాస్ యామెర్ (స్వీడన్), బాగ్నిస్ (అర్జెంటీనా) మధ్య మ్యాచ్ విజేతతో మూడో రౌండ్లో ప్రజ్నేశ్ ఆడతాడు. మెరుగైన ర్యాంక్‌తో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీకి నేరుగా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. -
జ్వెరెవ్‌కు ఝలక్
తొలి రౌండ్లోనే ఓడిన జర్మనీ యువతార ► ఆండీ ముర్రే శుభారంభం ► ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ పారిస్: అద్భుతం చేస్తాడని ఆశించిన జర్మనీ యువ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే చేతులెత్తేశాడు. ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో తొమ్మిదో సీడ్ జ్వెరెవ్ 4–6, 6–3, 4–6, 2–6తో ఓడిపోయాడు. పది రోజుల క్రితం రోమ్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించి విజేతగా నిలిచిన జ్వెరెవ్... అదే జోరును గ్రాండ్‌స్లామ్ టోర్నీలో కొనసాగించడంలో విఫలమయ్యాడు. ‘అత్యంత చెత్తగా ఆడాను. అందుకే ఓడాను. అయితే నా జీవితంలో ఇదేమీ విషాదం కాదు. రోమ్ టోర్నీలో నేను అద్భుతంగా ఆడాను. విజేతగా నిలిచాను. ఇక్కడ బాగా ఆడలేదు. అందుకే తొలి రౌండ్లోనే వెనుదిరిగాను. కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది’ అని 20 ఏళ్ల జ్వెరెవ్ వ్యాఖ్యానించాడు. ఈ గెలుపుతో మాడ్రిడ్ ఓపెన్ తొలి రౌండ్లో జ్వెరెవ్ చేతిలో ఎదురైన ఓటమికి వెర్డాస్కో బదులు తీర్చుకున్నట్టయింది. మరోవైపు టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) తొలి రౌండ్లో 6–4, 4–6, 6–2, 6–0తో కుజ్నెత్సోవ్ (రష్యా)పై నెగ్గి శుభారంభం చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–2, 7–6 (8/6), 6–3తో కొవాలిక్ (స్లొవేకియా)పై, 15వ సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 6–4, 7–5, 6–0తో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ)పై, 18వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 6–3, 7–6 (7/4), 6–3తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించారు. జొహనా కోంటాకు షాక్... మహిళల సింగిల్స్ విభాగంలో మరో సంచలనం నమోదైంది. టాప్ సీడ్ కెర్బర్ (జర్మనీ) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టగా... ఆమె సరసన ఏడో సీడ్ జొహానా కోంటా (బ్రిటన్) చేరింది. తొలి రౌండ్లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి సు వీ సెయి (చైనీస్ తైపీ) 1–6, 7–6 (7/2), 6–4తో కోంటాను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–3తో ష్వెదోవా (కజకిస్తాన్)పై, 12వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–2తో బార్టీ (ఆస్ట్రేలియా)పై, యుజిని బుచార్డ్ (కెనడా) 2–6, 6–3, 6–2తో ఒజాకి (జపాన్)పై గెలిచారు.