
ఫ్రెంచ్ ఓపెన్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించేందుకు భారత టెన్నిస్ యువతార ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మరో విజయం దూరంలో ఉన్నాడు. పారిస్‌లో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో అతను మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్)తో బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో ప్రజ్నేశ్ 6–4, 6–1తో గెలుపొందాడు.
ఇలియాస్ యామెర్ (స్వీడన్), బాగ్నిస్ (అర్జెంటీనా) మధ్య మ్యాచ్ విజేతతో మూడో రౌండ్‌లో ప్రజ్నేశ్ ఆడతాడు. మెరుగైన ర్యాంక్‌తో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీకి నేరుగా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment