ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వరల్ నంబర్ వన్ రఫెల్ నాదల్.. బాల్‌బాయ్‌తో కలిసి టెన్నిస్ ఆడి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. తద్వారా స్పెయిన్ బుల్ నాదల్ గొప్ప ప్లేయరే కాదు.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని కూడా నిరూపించుకున్నాడు. ఆదివారం 32వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న నాదల్.. ప్రస్తుతం జరుగుతుతన్న ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో దూసుకెళ్తున్నాడు. మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు రిచర్డ్ గాస్కెట్‌పై 6-3, 6-2, 6-2తో సునాయాసంగా గెలిచి నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టాడు నాదల్.