Ball Boys
-
సూపర్ క్యాచ్ పట్టిన బాల్ బాయ్.. హగ్ చేసుకున్న స్టార్ బ్యాటర్! వీడియో
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో భాగంగా సోమవారం రావల్పిండి వేదికగా పెషావర్ జెల్మీ, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడ్డాయి. ఈ హైలోల్టేజ్ పోరులో పెషావర్‌ను 29 పరుగుల తేడాతో ఇస్లామాబాద్ చిత్తు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ ఆటగాడు, కివీస్ స్టార్ కోలిన్ మున్రో ఓ బాల్ బాయ్‌ను ఎత్తుకున్నాడు. ఏం జరిగిందంటే? పెషావర్ ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లో అమీర్ జమాల్ భారీ సిక్స్ బాదాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ అవతల ఉన్న ఓ బాల్ బాయ్ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. ఇది గమనించిన మున్రో అతడి దగ్గరకు వెళ్లి బంతిని ఎలా పట్టుకోవాలో కొన్ని సూచనలు ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లో పెషావర్ బ్యాటర్ ఆరిఫ్ యూకుడ్ అదే పొజిషన్లో సిక్సర్ బాదాడు. ఈ సారి మాత్రం బాల్‌బాయ్ ఎటువంటి తప్పిదం చేయలేదు. అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన మున్రో వెంటనే అతడి దగ్గరకు వెళ్లి హగ్ చేసుకుని అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2024: ధోని సంచలన నిర్ణయం.. సీఎస్కే కెప్టెన్‌గా రుత్‌రాజ్ గైక్వాడ్!? From drop to dazzling catch! 😲 Ball boy redeems himself in #IUvPZ match and gets a warm hug from Colin Munro. #HBLPSL9 | #KhulKeKhel pic.twitter.com/ncTKJ0xPfr — PakistanSuperLeague (@thePSLt20) March 4, 2024 -
బాల్‌బాయ్ కల నెరవేర్చాడు..!
పారిస్: ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వరల్డ్ నంబర్ వన్ రఫెల్ నాదల్.. బాల్‌బాయ్‌తో కలిసి టెన్నిస్ ఆడి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. తద్వారా స్పెయిన్ బుల్ నాదల్ గొప్ప ప్లేయరే కాదు.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని కూడా నిరూపించుకున్నాడు. ఆదివారం 32వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న నాదల్.. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో దూసుకెళ్తున్నాడు. మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు రిచర్డ్ గాస్కెట్‌పై 6-3, 6-2, 6-2తో సునాయాసంగా గెలిచి నాలుగో రౌండ్లో అడుగుపెట్టాడు నాదల్. అయితే మ్యాచ్ తర్వాత అక్కడి బాల్‌బాయ్ కలను సాకారం చేశాడు. కోర్టు ప్రెజెంటర్ అతని ఇంటర్వ్యూ తీసుకుంటున్న సందర్భంగా మీకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారుగానీ.. ఇక్కడున్న మీ అతిపెద్ద అభిమాని.. మీతో ఒక్క బాలైనా ఆడాలనుకుంటున్నాడు అని నదాల్‌కు స్పష్టం చేశారు. దీనికి రఫా కూడా ఓకే చెప్పాడు. ఆ బాల్‌బాయ్ దగ్గరికెళ్లి తన రాకెట్ ఇచ్చి ఆడదాం పదా అంటూ ప్రోత్సహించాడు. తన అభిమాన ప్లేయర్‌తో అతనికెంతో ఇష్టమైన క్లే కోర్టుపై ఆడే అవకాశం రావడంతో ఆ బాల్‌బాయ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అతను కూడా ఓ పక్కా ప్రొఫెషనల్ ప్లేయర్‌లాగే ఆడాడు. ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో అదరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. -
బాల్‌బాయ్ కలను సాకారం చేశాడు
-
భలే బాల్‌బాయ్స్!
యూఎస్ ఓపెన్‌లో సందడి న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో విజయం సాధించేందుకు అగ్రశ్రేణి ఆటగాళ్లంతా కోర్టుల్లో ఒక వైపు పోటీ పడుతుంటే అవే కోర్టుల్లో ’అడుగు’ కోసం మరో రకమైన పోటీ అక్కడ ఉంటుంది. అక్కడ లభించే డబ్బు మరీ ఎక్కువ కాకపోవచ్చు. కానీ ఆ కాసింత చోటు దొరికితే చాలనుకున్న కుర్రాళ్లు చాలా మంది ఉంటారు. యూఎస్ ఓపెన్‌లో ఈ సారి కూడా ‘బాల్ బాయ్స్’ బాధ్యతల కోసం పెద్ద సంఖ్యలో పోటీ నడిచింది. గంటల పాటు క్యూలో నిల్చొని వారు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. 2-3 నిమిషాల్లో తాము బాల్ బాయ్‌గా ఎలా పనికొస్తామో వారు చూపించాల్సి ఉంటుంది. వేగంగా పరుగెత్తడం, బంతిని అందుకోవడం, సరైన విధంగా త్రో చేయడంలాంటివి పరీక్షించి అవకాశం ఇస్తారు. కనీసం 14 ఏళ్ల వయసు ఉండాలి. బాల్ బాయ్స్ అంటే అబ్బారుులు మాత్రమే కాదండోయ్ వారిలో అమ్మారుులు కూడా ఉంటారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను వడబోసి 200 మందిని యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఎంపిక చేశారు. వీరికి న్యూయార్క్ కనీస వేతనాల చట్టం ప్రకారం గంటకు కనీసం 9 డాలర్లు చెల్లిస్తారు! నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో బాల్ బాయ్స్‌కు డబ్బులు ఇచ్చేది ఒక్క యూఎస్ ఓపెన్‌లో మాత్రమే కావడం విశేషం. వీటికి తోడు రెండు జతల డ్రెస్ కిట్లు కూడా ఇస్తారు. ‘ఇది నా జీవితంలో మరపురాని మూడు వారాల సమయం. మ్యాచ్‌ను బాగా చూసేందుకు స్టేడియంలో అందరికంటే బెస్ట్ సీట్ నాదే‘ అని హైస్కూల్ అమ్మాయి మాడిసన్ కలినాన్ సంతోషం ప్రకటిస్తే, ‘ఇంత మంది ఆటగాళ్లను దగ్గరి నుంచి చూసి వారితో మాట్లాడే అవకాశం కూడా రావడానికి మించిన బహుమతి నాకేమీ లేదు‘ అని డార్విష్ అనే కుర్రాడు చెప్పాడు. అన్నట్లు ఆరంభంలో వీరిలో ఎక్కువ మందికి పెద్దగా ప్రాధాన్యత లేని మ్యాచ్‌లు జరిగే బయటి కోర్టుల్లోనే అవకాశం కల్పిస్తారు. అక్కడ మంచి ప్రతిభ కనబర్చి ఆర్మ్ట్రాంగ్ గ్రాండ్ స్టాండ్, ఆర్థర్ యాష్ సెంటర్ కోర్టులోకి ప్రమోషన్ తెచ్చుకోవాలనేదే వీరి కోరిక!