బాల్‌బాయ్‌ కల నెరవేర్చాడు..! | Rafael Nadal Makes Ball Boys Day At Roland Garros | Sakshi
Sakshi News home page

బాల్‌బాయ్‌ కల నెరవేర్చాడు..!

Published Mon, Jun 4 2018 1:44 PM | Last Updated on Mon, Jun 4 2018 4:06 PM

Rafael Nadal Makes Ball Boys Day At Roland Garros - Sakshi

పారిస్‌: ఫ్రెంచ్‌ గ్రాండ్‌ స్లామ్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వరల్డ్‌ నంబర్‌ వన్‌ రఫెల్‌ నాదల్‌.. బాల్‌బాయ్‌తో కలిసి టెన్నిస్‌ ఆడి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.  తద్వారా స్పెయిన్‌ బుల్‌ నాదల్‌ గొప్ప ప్లేయరే కాదు.. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని కూడా నిరూపించుకున్నాడు.  ఆదివారం 32వ బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్న నాదల్‌.. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్‌ గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలో దూసుకెళ్తున్నాడు. మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్‌ ఆటగాడు రిచర్డ్ గాస్కెట్‌పై 6-3, 6-2, 6-2తో సునాయాసంగా గెలిచి నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టాడు నాదల్‌.

అయితే మ్యాచ్ తర్వాత అక్కడి బాల్‌బాయ్ కలను సాకారం చేశాడు. కోర్టు ప్రెజెంటర్‌ అతని ఇంటర్వ్యూ తీసుకుంటున్న సందర్భంగా మీకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారుగానీ.. ఇక్కడున్న మీ అతిపెద్ద అభిమాని.. మీతో ఒక్క బాలైనా ఆడాలనుకుంటున్నాడు అని నదాల్‌కు స్పష్టం చేశారు.

దీనికి రఫా కూడా ఓకే చెప్పాడు. ఆ బాల్‌బాయ్ దగ్గరికెళ్లి తన రాకెట్ ఇచ్చి ఆడదాం పదా అంటూ ప్రోత్సహించాడు. తన అభిమాన ప్లేయర్‌తో అతనికెంతో ఇష్టమైన క్లే కోర్టుపై ఆడే అవకాశం రావడంతో ఆ బాల్‌బాయ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అతను కూడా ఓ పక్కా ప్రొఫెషనల్ ప్లేయర్‌లాగే ఆడాడు. ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో అదరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement