పక్కింట్లో చూసి బాధపడితే ఎలా? | Roger Federers record is my motivation not obsession Says Rafael Nadal | Sakshi
Sakshi News home page

పక్కింట్లో చూసి బాధపడితే ఎలా?

Published Wed, Jun 12 2019 3:40 AM | Last Updated on Wed, Jun 12 2019 3:40 AM

Roger Federers record is my motivation not obsession Says Rafael Nadal - Sakshi

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మరోసారి తిరుగులేని ఆట ప్రదర్శిస్తూ 12వ సారి టైటిల్‌ నెగ్గడంతో స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ సంఖ్య 18కి చేరింది. పురుషుల టెన్నిస్‌ చరిత్రలో అత్యధికంగా రోజర్‌ ఫెడరర్‌ సాధించిన 20 గ్రాండ్‌స్లామ్‌ల ఘనతను సమం చేసేందుకు అతను రెండు ట్రోఫీల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఆ రికార్డును అందుకునే అవకాశాలపై అడిగిన ప్రశ్నకు నాదల్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘మన పొరుగున ఉండేవారి ఇల్లు మన ఇంటికంటే పెద్దదిగా ఉందని, వారింట్లో గార్డెన్‌ మనకంటే బాగుందని, వాళ్ల ఇంట్లో టీవీ మనింట్లో ఉన్న దానికంటే పెద్దదిగా ఉందని అస్తమానం అసహనంతో ఉండలేం కదా? నేను జీవితాన్ని ఆ దృష్టితో చూడను. దాని కోసం నేను ఉదయాన్నే లేచి వెళ్లి సాధన చేయను. ఫెడరర్‌ రికార్డును స్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పు లేదు. కానీ దానిని ఎలాగైనా సాధించాలనే పిచ్చి మాత్రం నాకు లేదు’ అని స్పెయిన్‌ స్టార్‌ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement