ఫెడరర్‌పై నాదల్‌దే పైచేయి | Rafa Nadal Will Play for 12th French Open Title After Beating Archrival Roger Federer | Sakshi
Sakshi News home page

ఫెడరర్‌పై నాదల్‌దే పైచేయి

Published Sat, Jun 8 2019 5:05 AM | Last Updated on Sat, Jun 8 2019 5:05 AM

Rafa Nadal Will Play for 12th French Open Title After Beating Archrival Roger Federer - Sakshi

పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌ 12వ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో రెండో సీడ్‌ నాదల్‌ 6–3, 6–4, 6–2తో మూడో సీడ్‌ రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌)పై అలవోకగా గెలిచి ఈ టోర్నీలో 12వసారి ఫైనల్‌కు చేరాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫెడరర్‌తో ఇప్పటివరకు తలపడిన ఆరుసార్లూ నాదల్‌నే విజయం వరించడం విశేషం. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో నాదల్‌ ఆరుసార్లు ఫెడరర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. ఫెడరర్‌ 34 అనవసర తప్పిదాలు చేయగా... నాదల్‌ కేవలం 19 మాత్రమే చేశాడు.  

రెండో సెమీస్‌ నేటికి వాయిదా....
టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా), నాలుగో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) మధ్య రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. తొలి సెట్‌ను థీమ్‌ 6–2తో నెగ్గగా... రెండో సెట్‌ను జొకోవిచ్‌ 6–3తో దక్కించుకున్నాడు. మూడో సెట్‌లో థీమ్‌ 3–1తో ఆధిక్యంలో ఉన్నపుడు వర్షం రావడంతో మ్యాచ్‌ను శనివారానికి వాయిదా వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement