Viral Video: Nick Kyrgios Heated Clash With Opponent Coach In Locker Room - Sakshi
Sakshi News home page

'మా ఆటను చూసి భయపడ్డారు.. ఇంకేం ఫైట్‌ చేస్తారు'

Published Sat, Jan 22 2022 3:34 PM | Last Updated on Sat, Jan 22 2022 6:56 PM

Nick Kyrgios Challenge FIGHT Opponent Coach Heated Clash In Locker Room - Sakshi

ఆస్ట్రేలియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ నిక్‌ కిర్గియోస్‌ తన వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచ డబుల్స్‌ నెంబర్‌ వన్‌ జంట నికోలా మెక్టిక్‌, మేట్‌ పావిక్‌లు మాతో ఫైట్‌ చేయడానికి భయపడ్డారంటూ పేర్కొనడం సంచలనం రేపింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో శనివారం జరిగిన మెన్స్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో నిక్‌ కిర్గియోస్‌, తానాసి కొక్కినకిస్ జంట క్రొయేషియాకు చెందిన నికోలా మెక్టిక్‌, మేట్‌ పావిక్‌ జంటను 7-6, 6-3 ఓడించింది. ఈ మ్యాచ్‌ను గెలిచిన నిక్‌ కిర్గియోస్‌.. ప్రత్యర్థిపై తన మాటలతోనూ మానసికంగానూ  పైచేయి సాధించాలనుకున్నాడు.

చదవండి: Australian Open 2022: డిఫెండింగ్‌ చాంపియన్‌కు షాకిచ్చిన అన్‌సీడెడ్‌ ప్లేయర్‌

మ్యాచ్‌ ముగిసిన అనంతరం లాకర్‌ రూమ్‌కు వెళ్లిన కిర్గియోస్‌.. అక్కడ నికోలా మెక్టిక్‌, మేట్‌ పావిక్‌ల కోచ్‌, ట్రైనర్‌ కనిపించారు. వారి వద్దకు వెళ్లిన కిర్గియోస్‌ డిబేట్‌ చేశాడు. ''ఆ ఇద్దరు మా ఆటను చూసి భయపడిపోయారు.. ఇంకేం ఫైట్‌ చేస్తారు'' అంటూ పేర్కొన్నాడు. ఇక కిర్గియోస్‌ ప్రవర్తనపై  టెన్నిస్‌ అభిమానులు మాత్రం గుర్రుగా ఉన్నారు. మొన్న సింగిల్స్‌ మ్యాచ్‌లో డేనియల్‌ మెద్వదేవ్‌ను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన కిర్గియోస్‌.. ఆ మ్యాచ్‌లో ఓటమి పాలయ్యి చేతలు కాల్చుకున్నాడు. తాజాగా డబుల్స్‌ మ్యాచ్‌లో విజయం సాధించగానే తనలోని మరో కోణాన్ని బయటకు తీశాడు. సొంతగడ్డపై గ్రాండ్‌స్లామ్‌ ఆడుతున్నాననే గర్వం కిర్గియోస్‌లో కనిపిస్తుంది.. అదే అతని పతనానికి కారణమవుతుందని కామెంట్స్‌ చేశారు. అయితే లాకర్‌ రూమ్‌లో కిర్గియోస్‌ పెట్టిన డిబేట్‌ వీడియో ప్రత్యక్షమవడం.. క్షణాల్లో వైరల్‌ కావడం జరిగిపోయింది. 

చదవండి: Daniil Medvedev: గెలిచిన ఆనందం లేకుండా చేశారు.. ప్లేయర్‌ భావోద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement