
సిడ్నీ: ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో తాను బరిలోకి దిగడంలేదని ఆస్ట్రేలియా వివాదాస్పద ఆటగాడు, ప్రపంచ 40వ ర్యాంకర్ నిక్ కిరియోస్ తెలిపాడు. మూడు రోజుల క్రితమే మహిళల ప్రపంచ నంబర్‌వన్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) కూడా కరోనా కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉంటున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవైపు కరోనాతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్న సమయంలో మరోవైపు టెన్నిస్ ఆడటం ఏంటని కిరియోస్ ప్రశ్నించాడు. కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి సంఘీభావంగానే తానీ నిర్ణయం తీసుకున్నాని అన్నాడు. ‘ఈ ఏడాది జరిగే యూఎస్ ఓపెన్‌లో నేను పాల్గొనడం లేదు. ఇది నా వ్యక్తిగత నిర్ణయం’ అని 25 ఏళ్ల కిరియోస్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment