
యాంట్‌వర్ప్ (బెల్జియం): యూరోపియన్ ఓపెన్ ఏటీ పీ–250 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 100వ ర్యాంకర్ యూకీ 6–7 (6/8), 7–5, 1–6తో ప్రపంచ 167వ ర్యాంకర్ సాల్వటోర్ కరూసో (ఇటలీ) చేతిలో ఓడిపోయాడు. తొలి రౌండ్‌లో ఓడిన యూకీకి 6,200 (రూ. 5 లక్షల 20 వేలు) యూరోలు ప్రైజ్‌మనీగా లభించాయి. ఇదే టోర్నీ డబుల్స్ విభాగం తొలి రౌండ్‌లో దివిజ్ శరణ్ (భారత్)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట 7–5, 6–4తో లియాండర్ పేస్ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) ద్వయంపై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment