
స్వదేశంలో వరుసగా రెండో ఏటీపీ చాలెంజర్ టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో ఉన్న భారత టెన్నిస్ యువతార యూకీ బాంబ్రీ బెంగళూరు ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో యూకీ 6–2, 7–6 (7/0)తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై గెలిచాడు.
ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సుమీత్ నాగల్ (భారత్) 6–4, 4–6, 7–5తో బ్రైడన్ క్లియెన్ (బ్రిటన్)పై, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (భారత్) 6–2, 6–7 (1/7), 6–1తో మార్క్ పాల్‌మన్స్ (ఆస్ట్రేలియా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరారు.అయితే రామ్‌కుమార్ రామనాథన్ 7–6 (7/3), 2–6, 4–6తో జే క్లార్క్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment