సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్‌సలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని 194వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్‌సలో భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ 287 పాయింట్లతో మరోసారి భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా నిలిచాడు.
హైదరాబాద్‌కే చెందిన విష్ణువర్ధన్ 431వ ర్యాంక్‌లో ఉన్నాడు. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న 28వ ర్యాంక్‌లో, లియాండర్ పేస్ 59వ ర్యాంక్‌లో, దివిజ్ శరణ్ 63వ ర్యాంక్‌లో ఉన్నారు. మరోవైపు మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్‌సలో మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతోంది.