నింగ్బో: యిన్‌జౌ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. చైనాలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాకేత్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట 6–0, 6–3తో హిరోకి మొరియా (జపాన్)–రూబిన్ స్థాతమ్ (న్యూజిలాండ్) జోడీపై నెగ్గింది. 54 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ద్వయం రెండు ఏస్‌లు సంధించడంతోపాటు తమ ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ఇదే టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 6–3, 2–6, 7–6 (7/0)తో లీ జె (చైనా)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment