వరల్డ్‌ నెంబర్‌ వన్‌పై విజయం.. ఏటీపీ టోర్నీ ఫైనల్స్‌కు అర్హత | ATP Finals: Russia Daniil Medvedev Qualify For Final | Sakshi
Sakshi News home page

Daniil Medvedev: ఏటీపీ టోర్నీ ఫైనల్స్‌కు అర్హత

Published Wed, Sep 15 2021 10:17 AM | Last Updated on Wed, Sep 15 2021 10:21 AM

ATP Finals: Russia Daniil Medvedev Qualify For Final - Sakshi

Nitto ATP Finals: వచ్చే నెలలో ఇటలీలో జరిగే టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ఏటీపీ ఫైనల్స్‌కు ప్రపంచ రెండో ర్యాంకర్‌ మెద్వెదెవ్‌ (రష్యా) వరుసగా మూడో ఏడాది అర్హత సాధించాడు. యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ గెలవడంతో మెద్వెదెవ్‌కు ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ బెర్త్‌ ఖరారైంది. కాగా సోమవారం జరిగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో మెద్వెదెవ్‌ వరుస సెట్లలో 6–4, 6–4, 6–4తో జొకోవిచ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.

రెండు గంటల 15 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో మెద్వెదెవ్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ... మెద్వెదెవ్‌ 16 ఏస్‌లు కొట్టగా, జొకో 6 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 2019లో ఇదే టోర్నీ ఫైనల్లో నాదల్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్‌... రెండేళ్ల తర్వాత తన తొలి గ్రాండ్‌స్లామ్‌ కల నెరవేర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఏటీపీ ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఇదిలా ఉండగా.. గ్రీక్‌ టెన్నిస్‌ స్టార్‌ స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ కూడా ఫైనల్‌కు చేరుకున్నాడు.

చదవండి: VIDEO: యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో మరోసారి బయటపడ్డ వెర్రితనం! రాకెట్‌ విరగొట్టి.. బాల్‌గర్ల్‌ను భయపెట్టి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement