![Toni Nadal Unhappy With The New Schedule - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/29/Toni.jpg.webp?itok=2Vc0D2bh)
మాడ్రిడ్ (స్పెయిన్): అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) విడుదల చేసిన కొత్త క్యాలెండర్‌పై 19 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) అంకుల్, మాజీ కోచ్ టోనీ నాదల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదేం షెడ్యూల్ అంటూ ఏటీపీపై విరుచుకుపడ్డాడు. రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ల మధ్య రెండు వారాల వ్యవధి మాత్రమే ఉండటం ఏంటని ఏటీపీని టోనీ ప్రశ్నించాడు. తాజా షెడ్యూల్ ప్రకారం యూఏస్ ఓపెన్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13... ఫ్రెంచ్ ఓపెన్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 11 మధ్య జరగనున్నాయి. వీటి మధ్యలో మాడ్రిడ్, రోమ్ మాస్టర్స్ టోర్నీలను కూడా నిర్వహించనున్నారు. ఇటువంటి షెడ్యూల్ శారీరకంగా ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూçపుతుందని... ముఖ్యంగా నాదల్, జొకోవిచ్ లాంటి వెటరన్స్‌పై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment