న్యూఢిల్లీ: కరోనా అదుపులోకి వస్తున్న తరుణంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 2021-22 సీజన్‌కు గానూ దేశవాళీ క్రికెట్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరు 21న సీనియర్ వుమెన్ వన్డే లీగ్‌తో డొమెస్టిక్ క్రికెట్ ఈవెంట్లు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. అదే విధంగా.. అక్టోబరు 20న సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ మొదలుకానుందని, నవంబరు 12 ఇందుకు సంబంధించి ఫైనల్ మ్యాచ్ ఉంటుందని పేర్కొంది. వీటితో పాటు రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ ఈవెంట్లకు సంబంధించిన వివరాలను శనివారం విడుదల చేసిన తన ప్రకటనలో తెలిపింది. ఈ సీజన్‌లో మొత్తంగా మహిళా, పురుషుల క్రికెట్.. అన్ని ఫార్మాట్లలో 2127 దేశవాళీ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
2021-2022 డొమెస్టిక్ క్రికెట్ షెడ్యూల్:
►సీనియర్ వుమెన్ వన్డే లీగ్: సెప్టెంబరు 21, 2021న ప్రారంభం
►సీనియర్ వుమెన్ వన్డే చాలెంజర్ ట్రోఫీ- అక్టోబరు 27, 2021
►సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: అక్టోబరు 20, 2021- నవంబరు 12, 2021
►రంజీ ట్రోఫీ: నవంబరు 16, 2021- ఫిబ్రవరి 19, 2022
►విజయ్ హజారే ట్రోఫీ: ఫిబ్రవరి 23, 2022- మార్చి 26, 2022
Comments
Please login to add a commentAdd a comment