రన్నరప్ సానియా జంట | Sania Mirza-Barbora Strycova lose in Wuhan Open final | Sakshi
Sakshi News home page

రన్నరప్ సానియా జంట

Published Sun, Oct 2 2016 2:31 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

రన్నరప్ సానియా జంట

రన్నరప్ సానియా జంట

న్యూఢిల్లీ: ఈ ఏడాది తొమ్మిదో డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. చైనాలో శనివారం జరిగిన వుహాన్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా-బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సానియా-స్ట్రికోవా జోడీ 1-6, 4-6తో బెథానీ మాటెక్ సాండ్‌‌స (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోరుుంది.

61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోరుు, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. రన్నరప్‌గా నిలిచిన సానియా జోడీకి 68 వేల 200 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 45 లక్షల 39 వేలు)తోపాటు 585 ర్యాంకింగ్ పారుుంట్లు... విజేతగా నిలిచిన బెథానీ-సఫరోవా జంటకు లక్షా 35 వేల డాలర్ల (రూ. 89 లక్షల 85 వేలు)తోపాటు 900 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement