రన్నరప్ బోపన్న జంట | Rohan Bopanna team in runner-up position | Sakshi
Sakshi News home page

రన్నరప్ బోపన్న జంట

Published Sun, Jan 12 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:31 AM

Rohan Bopanna team in runner-up position

 సిడ్నీ: తుదికంటా పోరాడినా రోహన్ బోపన్న (భారత్)-ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) జోడీ సీజన్‌లో తొలి డబుల్స్ టైటిల్ సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. శనివారం ముగిసిన సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఈ ఇండో-పాక్ ద్వయం రన్నరప్‌తో సంతృప్తి చెందింది.
 
  ఫైనల్లో డానియల్ నెస్టర్ (కెనడా)-నెనాద్ జిమోనిచ్ (సెర్బియా) జోడి 7-6(7/3), 7-6(7/3)తో బోపన్న-ఖురేషీ జంటపై నెగ్గింది. మ్యాచ్‌లో ఎక్కడా ఒక్కసారి కూడా సర్వీస్ బ్రేక్ కాకపోవడంతో రెండు సెట్లలోనూ టైబ్రేకర్‌లోనే ఫలితం వచ్చింది. బోపన్న జోడికి 13,100 డాలర్ల (రూ. 8 లక్షలు) ప్రైజ్‌మనీతో పాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement