సానియాకు మరో డబుల్స్ టైటిల్ | Sania Mirza to another doubles title | Sakshi
Sakshi News home page

సానియాకు మరో డబుల్స్ టైటిల్

Published Sun, Aug 28 2016 1:24 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

సానియాకు మరో డబుల్స్ టైటిల్

సానియాకు మరో డబుల్స్ టైటిల్

న్యూ హవెన్ (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన కనెక్టికట్ డబ్ల్యూటీఏ ఓపెన్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా (భారత్)-మోనికా నికెలెస్కూ (రొమేనియా) ద్వయం 7-5, 6-4తో కాటరీనా బొండారెంకో (ఉక్రెరుున్)-చువాంగ్ చియా జంగ్ (చైనీస్ తైపీ) జోడీపై విజయం సాధించింది.

ఈ ఏడాది సానియాకిది ఏడో టైటిల్‌కాగా... కెరీర్‌లో 38వది. విజేతగా నిలిచిన సానియా జంటకు 40,650 డాలర్ల (రూ. 27 లక్షల 29 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 470 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సానియా-మోనికా జంట 2-6, 6-3, 10-8తో ‘సూపర్ టైబ్రేక్’లో ఆంద్రెజా క్లెపాక్-కాటరీనా స్రెబెత్నిక్ (స్లొవేనియా) జోడీపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement