
కాలిఫోర్నియా (అమెరికా): భారత టెన్నిస్ యువతార యూకీ బాంబ్రీ తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో 25 ఏళ్ల ఈ ఢిల్లీ ప్లేయర్ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ 110వ ర్యాంకర్ యూకీ 6–4, 6–4తో ప్రపంచ 12వ ర్యాంకర్ లుకాస్ పుయి (ఫ్రాన్స్)ను బోల్తా కొట్టించాడు. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మూడో రౌండ్‌లో ప్రపంచ 21వ ర్యాంకర్ సామ్ క్వెరీ (అమెరికా)తో యూకీ తలపడతాడు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 7–5, 2–6, 4–10తో గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)–సామ్ క్వెరీ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది.
ఫెడరర్ ముందుకు... జొకోవిచ్ ఇంటికి
మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లగా... ఐదుసార్లు మాజీ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) రెండో రౌండ్‌లో ఇంటిముఖం పట్టాడు. రెండో రౌండ్‌లో ఫెడరర్ 6–3, 7–6 (8/6)తో డెల్‌బోనిస్ (అర్జెంటీనా)పై నెగ్గగా... క్వాలిఫయర్ టారో డానియల్ (జపాన్) 7–6 (7/3), 4–6, 6–1తో పదో సీడ్ జొకోవిచ్‌ను ఓడించాడు.
Comments
Please login to add a commentAdd a comment