సెమీస్‌లో సానియా జోడి | Indo Jodi | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జోడి

Published Fri, Mar 14 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

సెమీస్‌లో సానియా జోడి

సెమీస్‌లో సానియా జోడి

ఇండియన్ వెల్స్ (అమెరికా): భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి బీఎన్‌పీ పారిబా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఐదోసీడ్ సానియా-కారా 6-4, 6-1తో రెండోసీడ్ మకరోవా-వెస్నినా (రష్యా)పై నెగ్గారు. ఇదే వేదికపై జరుగుతోన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో భారత పోరాటం ముగిసింది. క్వార్టర్‌ఫైనల్లో సీనియర్ ఆటగాడు, నాలుగోసీడ్ లియాండర్ పేస్-స్టెపానెక్ (చెక్) జోడి 3-6, 7-6 (4/6), 4-10తో ఫెడరర్-వావ్రింకా (స్విట్జర్లాండ్) చేతిలో ఓడింది.

గంటా 19 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పేస్ జంట మూడు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకుంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement