
పుణే: ఈ ఏడాది స్వదేశంలో జరుగుతున్న తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్న మెంట్ పుణే ఓపెన్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు, భారత డేవిస్‌కప్ జట్టు సభ్యుడు సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సాకేత్ 6–3, 4–6, 6–2తో తొమిస్లావ్ బ్రికిక్ (బోస్నియా హెర్జెగోవినా)పై గెలిచాడు. గంటా 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ 12 ఏస్‌లు సంధించాడు.
మరో మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ (భారత్) 6–4, 6–2తో కరీమ్ మొహమ్మద్ మామౌన్ (ఈజిప్ట్)ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ 3–6, 6–4, 6–7 (6/8)తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్) చేతిలో... గతేడాది రన్నరప్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ (భారత్) 3–6, 3–6తో ఇవాన్ కింగ్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment