సిన్సినాటి (అమెరికా): సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో 6–4, 6–4తో స్విస్ దిగ్గజం ఫెడరర్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అందు బాటులో ఉన్న తొమ్మిది మాస్టర్స్ సిరీస్–1000 టైటిల్స్‌ను గెల్చుకున్న తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.
1990 నుంచి మాస్టర్స్ సిరీస్ టోర్నీలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది టోర్నీలు ఈ జాబితాలో ఉన్నాయి. గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత అత్యంత ప్రాధా న్యత ఉన్న టోర్నీలుగా మాస్టర్స్ టోర్నమెంట్‌లకు గుర్తింపు ఉంది. జొకోవిచ్ గెలిచిన మాస్టర్స్ టైటిల్స్ (మొత్తం 31): మయామి (6), ఇండియన్‌వెల్స్ (5), రోమ్ (4), కెనడా (4), పారిస్ (4), షాంఘై (3), మోంటెకార్లో (2), మాడ్రిడ్ (2), సిన్సినాటి (1).
జొకోవిచ్ చేతికి ‘నవరత్నాలు’
Published Tue, Aug 21 2018 1:02 AM | Last Updated on Tue, Aug 21 2018 1:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment