
పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ‘ఏటీపీ ఫైనల్స్’లో సెర్బియా స్టార్ జొకోవిచ్ ఆరోసారి విజేతగా నిలిచాడు. ఆరు టైటిల్స్‌తో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఇటలీలోని ట్యూరిన్ నగరంలో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 7–5, 6–3తో మూడో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే)పై గెలిచాడు.
ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన జొకోవిచ్‌కు టెన్నిస్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్‌మనీ లభించింది. అతను 47 లక్షల డాలర్లు (రూ. 38 కోట్ల 35 లక్షలు) గెల్చుకున్నాడు. గతంలో జొకోవిచ్ 2008, 2012, 2013, 2014, 2015లలో ఈ టోర్నీ టైటిల్స్‌ను సాధించాడు.
చదవండి: FIFA World CUP 2022: ఇంగ్లండ్‌తో మ్యాచ్.. జాతీయ గీతం పాడకుండా ఇరాన్ ఆటగాళ్ల నిరసన