
ఫైనల్లో విష్ణువర్ధన్ జంట
చెన్నై: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-3 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు విష్ణువర్ధన్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు.
గురువారం జరిగిన సెమీఫైనల్లో విష్ణు తన భాగస్వామి జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్)తో కలిసి 6-4, 3-6, 10-6తో రాజగోపాలన్-రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడిపై గెలిచాడు. నాలుగు ఏస్‌లు సంధించిన విష్ణు ద్వయం ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. రెండు జోడిలు తమ సర్వీస్‌లను మూడేసిసార్లు కోల్పోయాయి.
అయితే నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో విష్ణు జంట పైచేయి సాధించి విజయాన్ని దక్కించుకుంది. శుక్రవారం జరిగే ఫైనల్లో శ్రీరామ్ బాలాజీ-రంజిత్ మురుగేశన్ (భారత్) జోడితో విష్ణు ద్వయం తలపడుతుంది