సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని ఆసరాగా తీసుకుని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. తాము చెప్పిందే వేదం.. చేసిందే రాజ్యాంగం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలే సాక్ష్యం.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సోమవారం విశాఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు చంద్రబాబును ఎయిర్‌పోర్టులో అడ్డుకుని నిర్భందించిన వారు ఎక్కడున్నారు?. ఇప్పుడు ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు?. రెడ్ బుక్ ఏమైంది?. బయటకు తీయాల్సిందే. వారిని కఠినంగా శిక్షించాలి.
ఎన్నికల సమయంలో వారి అంతు చూద్దామనుకున్నాను. వారిని దేవుడే చూసుకుంటాడులే అనుకుంటే కుదరదు. మనం బతికి ఉన్నప్పుడే వారి అంతు చూడాలి. కూటమికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని ఎవ్వరినీ వదిలేది లేదు. అందరి సంగతి తేలుస్తాం అంటూ కామెంట్స్ చేశారు.
మరోవైపు.. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ..‘బీజేపీ కార్యకర్తలను గుర్తించాలనే ఆలోచనతోనే నాకు పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ నేతలు అన్ని విషయాల్లో కలుగజేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవ్వరినీ వదిలేది లేదు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment