
హాలె (జర్మనీ): కెరీర్‌లో 99వ సింగిల్స్ టైటిల్ నెగ్గాలని ఆశించిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు నిరాశ ఎదురైంది. గ్యారీ వెబెర్ ఓపెన్ టైటిల్‌ను పదోసారి నెగ్గాలనే లక్ష్యంతో ఫైనల్ బరిలోకి దిగిన అతనికి క్రొయే షియాకు చెందిన 21 ఏళ్ల బోర్నా కోరిచ్ షాక్ ఇచ్చాడు. రెండు గంటల ఆరు నిమిషాలపాటు జరిగిన తుది పోరులో కోరిచ్ 7–6 (8/6), 3–6, 6–2తో ఫెడరర్‌ను బోల్తా కొట్టించి విజేతగా నిలిచాడు.
చాంపియన్ కోరిచ్‌కు 4,27,590 యూరోలు (రూ. 3 కోట్ల 38 లక్షలు); రన్నరప్ ఫెడరర్‌కు 2,09,630 యూరోలు (రూ. కోటీ 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గత వారం మెర్సిడెస్ కప్ టైటిల్ గెలిచి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సొంతం చేసుకున్న ఫెడరర్ తాజా ఓటమితో సోమవారం విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను రాఫెల్ నాదల్ (స్పెయిన్)కు కోల్పోనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment