
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –500 బ్యాడ్మింటన్ టోర్నీలో మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో ఈ జోడీ 19–21, 21–14, 21–17తో అక్బర్–విన్నీ ఒక్తా(ఇండోనేసియా) ద్వయంపై గెలిచింది.
పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో హైదరాబాద్ ప్లేయర్ రాహుల్ యాదవ్ 14–21, 12–21తో సితికోమ్ (థాయ్‌లాండ్) చేతిలో, కార్తికేయ 14–21, 26–28తో సోనీ ద్వి కుంకొరో (ఇండోనేసియా) చేతిలో, శ్రేయాన్‡్ష 7–21, 9–21తో లూ గ్వాంగ్‌జు (చైనా) చేతిలో ఓడారు. మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్‌లో చుక్కా సాయి ఉత్తేజిత రావు 18–21, 9–21తో యూలియా సుసాంతో (ఇండోనేసియా) చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment