
ఫీవర్–ట్రీ ఏటీపీ–500 టెన్నిస్ చాంపియన్‌షిప్ నుంచి భారత నంబర్‌వన్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ప్రపంచ 31వ ర్యాంకర్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)తో లండన్‌లో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో యూకీ 1–6, 1–3తో వెనుకబడి ఉన్న దశలో గాయం కారణంగా తప్పుకున్నాడు. క్వాలిఫయర్‌గా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన యూకీకి తొలి రౌండ్‌లోనే వైదొలిగినప్పటికీ 14,690 యూరోల (రూ. 11 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.