
రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఏడుసార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో నాదల్ 6–1, 6–0తో దామిర్ జుమ్‌హుర్ (బోస్నియా)పై గెలుపొందాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన నాదల్‌కు రెండో రౌండ్‌లో తన ప్రత్యర్థి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఈ వారం ఫెడరర్‌కు నంబర్‌వన్ ర్యాంక్ కోల్పోయిన నాదల్ ఈ టోర్నీ గెలిస్తే మళ్లీ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment