
పారిస్: గతవారం స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్‌కు కోల్పోయిన నంబర్‌వన్ ర్యాంక్‌ను స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ తిరిగి చేజిక్కించుకున్నాడు. ఆదివారం రోమ్ ఓపెన్ టైటిల్ నెగ్గడంతో నాదల్ 8,770 పాయింట్లతో రెండో స్థానం నుంచి టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 8,670 పాయింట్లతో ఫెడరర్ రెండో స్థానానికి పడిపోయాడు.
మాజీ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ నాలుగు స్థానాలు దిగజారి 22వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ ఆదివారం మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్నాడు. మరోవైపు భారత్‌కు చెందిన యూకీ బాంబ్రీ 94వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... రామ్‌కుమార్ మూడు స్థానాలు ఎగబాకి 121వ ర్యాంక్‌కు చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment