రన్నరప్‌ యూకీ బాంబ్రీ  | Runnerup yuki bomber | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ యూకీ బాంబ్రీ 

Feb 18 2018 12:11 AM | Updated on Feb 18 2018 12:11 AM

Runnerup yuki bomber - Sakshi

యూకీ బాంబ్రీ

చెన్నై: సీజన్‌లో తొలి ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్‌ స్టార్‌ యూకీ బాంబ్రీకి నిరాశ ఎదురైంది. శనివారం ముగిసిన చెన్నై ఓపెన్‌లో ఈ ఢిల్లీ ప్లేయర్‌ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. టాప్‌ సీడ్‌ జోర్డాన్‌ థాంప్సన్‌ (ఆస్ట్రేలియా)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో రెండో సీడ్‌ యూకీ 5–7, 6–3, 5–7తో పోరాడి ఓడిపోయాడు.

రెండు గంటల 37 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ఒక్క ఏస్‌ కూడా కొట్టకపోవడం గమనార్హం. తన సర్వీస్‌ను ఎనిమిదిసార్లు కోల్పోయిన యూకీ, ప్రత్యర్థి సర్వీస్‌ను కూడా ఎనిమిదిసార్లు బ్రేక్‌ చేశాడు. అయితే కీలకదశలో థాంప్సన్‌ గేమ్‌లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. రన్నరప్‌ యూకీకి 4,240 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 74 వేలు)తోపాటు 48 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement