పేస్‌ జంటకు నిరాశ  | Bopanna pair in Quarters | Sakshi
Sakshi News home page

పేస్‌ జంటకు నిరాశ 

Published Wed, Jan 3 2018 12:20 AM | Last Updated on Wed, Jan 3 2018 12:20 AM

Bopanna pair in Quarters - Sakshi

పుణే: భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ కొత్త ఏడాదిని ఓటమితో ప్రారంభించాడు. స్వదేశంలో జరిగే ఏకైక ఏటీపీ-250 టోర్నమెంట్‌ టాటా ఓపెన్‌లో తన భాగస్వామి పురవ్‌ రాజాతో కలిసి బరిలోకి దిగిన పేస్‌కు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. భారత్‌కే చెందిన రోహన్‌ బోపన్న-జీవన్‌ నెదున్‌చెజియాన్‌ జంట 6-3, 6-2తో పేస్‌-పురవ్‌ జోడీని అలవోకగా ఓడించింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి జంట సర్వీస్‌ను నాలుగు సార్లు బ్రేక్‌ చేసింది.

ఈ గెలుపుతో బోపన్న జంట క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. యూకీ బాంబ్రీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించగా... సుమీత్‌ నాగల్‌ వెనుదిరిగాడు. తొలి రౌండ్‌లో యూకీ 6-3, 6-4తో అర్జున్‌ ఖడేపై గెలుపొందగా... క్వాలిఫయర్‌ సుమీత్‌ 3-6, 3-6తో ఇల్యా ఇవష్కా (బెలారస్‌) చేతిలో ఓడిపోయాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement