
మహిళల టెన్నిస్‌లో కొత్త కెరటం నయోమి ఒసాకా (జపాన్) స్వదేశంలో తొలి టైటిల్ సాధించేందుకు విజయం దూరంలో నిలిచింది. టోక్యోలో జరుగుతోన్న పాన్ పసిఫిక్ ఓపెన్ టోర్నమెంట్‌లో ఆమె ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఒసాకా 6–2, 6–3తో కామిలా గియోర్గి (ఇటలీ)పై గెలిచింది.
నేడు జరిగే తుది పోరులో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో ఒసాకా ఆడుతుంది. ఇటీవలే యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనా విలియమ్స్‌ను ఓడించిన ఒసాకా కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది.