లండన్: రికార్డుస్థాయిలో తొమ్మిదో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్‌పై గురి పెట్టిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ 89 నిమిషాల్లో 6–4, 6–4, 6–1తో లుకాస్ లాకో (స్లొవేకియా)పై గెలిచాడు. వరుసగా 20వ వింబుల్డన్ టోర్నీలో ఆడుతోన్న ఫెడరర్ ఈ మ్యాచ్‌లో 48 విన్నర్స్‌తోపాటు 16 ఏస్‌లు సంధించాడు. శుక్రవారం జరిగే మూడో రౌండ్‌లో జాన్ లెనార్డ్ స్ట్రఫ్ (జర్మనీ)తో ఫెడరర్ ఆడతాడు. ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)తో 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో స్ట్రఫ్ 6–7 (3/7), 3–6, 7–6 (7/4), 7–6 (7/4), 13–11తో గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో కార్లోవిచ్ ఏకంగా 61 ఏస్‌లు సంధించడం విశేషం. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 7–6 (7/4), 6–3, 6–3తో స్తకోవ్‌స్కీ (ఉక్రెయిన్)పై, 13వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) 7–6 (7/4), 7–6 (7/4), 7–6 (7/4)తో మిల్‌మాన్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు.
షరపోవా ఓటమి
మహిళల సింగిల్స్‌లో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) తొలి రౌండ్‌లో, రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్), మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్), మాజీ రన్నరప్ రద్వాన్‌స్కా (పోలాండ్) రెండో రౌండ్‌లో ఇంటిదారి పట్టారు. దియాత్‌చెంకో (రష్యా) 6–7 (3/7), 7–6 (7/3), 6–4తో షరపోవాను ఓడించగా... మకరోవా (రష్యా) 6–4, 1–6, 7–5తో వొజ్నియాకిపై, ఏడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3తో అజరెంకాపై, సఫరోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–4తో రద్వాన్‌స్కాపై నెగ్గారు. మరోవైపు ‘విలియమ్స్ సిస్టర్స్’ సెరెనా, వీనస్ మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. రెండో రౌండ్‌లో సెరెనా 6–1, 6–4తో విక్టోరియా తొమోవా (బల్గేరియా)పై, వీనస్ 4–6, 6–0, 6–1తో అలెగ్జాండ్రా డల్గెరూ (రొమేనియా)పై విజయం సాధించారు.
పురవ్ రాజా జంట పరాజయం
పురుషుల డబుల్స్‌లో పురవ్ రాజా (భారత్)–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జంట తొలి రౌండ్‌లో పోరాడి ఓడింది. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో పురవ్ రాజా–మార్టిన్ ద్వయం 2–6, 4–6, 7–6 (7/5), 6–4, 9–11తో మీర్జా బేసిక్ (బోస్నియా హెర్జెగోవినా)–లాజోవిక్ (సెర్బియా) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది.
ఫెడరర్ ఫటాఫట్
Published Thu, Jul 5 2018 1:29 AM | Last Updated on Thu, Jul 5 2018 1:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment