
స్పెయిన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ మరో మైలురాయి చేరుకున్నాడు. క్లే కోర్టులపై 400 విజయాలు సాధించిన నాలుగో ప్లేయర్‌గా నిలిచాడు. బార్సిలోనా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా అతను ఈ ఘనత సాధించాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో నాదల్ 6–4, 6–0తో గాఫిన్ (బెల్జియం)పై గెలుపొందాడు.
క్లే కోర్టులపై అత్యధిక విజయాలు సాధించిన క్రీడాకారుల జాబితాలో గిలెర్మో విలాస్ (అర్జెంటీనా–659), మాన్యుయెల్ ఒరాన్‌టస్ (స్పెయిన్–502), థామస్ ముస్టర్ (ఆస్ట్రియా–422) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.