
స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ గ్యారీ వెబెర్ ఓపెన్‌లో 12వసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. జర్మనీలోని హాలె నగరంలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఫెడరర్ 7–6 (7/1), 6–5తో క్వాలిఫయర్ డెనిస్ కుడ్లా (అమెరికా)పై గెలుపొందాడు.
14వసారి ఈ టోర్నీలో బరిలోకి దిగిన ఫెడరర్ తొమ్మిదిసార్లు విజేతగా నిలిచి, రెండుసార్లు రన్నరప్ ట్రోఫీని సాధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో బోర్నా కోరిచ్ (క్రొయేషియా)తో ఫెడరర్ తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment