విష్ణువర్ధన్‌కు 32వ డబుల్స్‌ టైటిల్‌ | Vishnuvardhan to the 32nd doubles title | Sakshi
Sakshi News home page

విష్ణువర్ధన్‌కు 32వ డబుల్స్‌ టైటిల్‌

Published Sat, Mar 11 2017 1:01 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

విష్ణువర్ధన్‌కు 32వ డబుల్స్‌ టైటిల్‌

విష్ణువర్ధన్‌కు 32వ డబుల్స్‌ టైటిల్‌

భిలాయ్‌ (ఛత్తీస్‌గఢ్‌): అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) పురుషుల ఫ్యూచర్స్‌ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాదీ ఆటగాడు విష్ణువర్ధన్‌ జోడి సత్తా చాటింది. ఇక్కడి బీఎస్‌పీ టెన్నిస్‌ కాంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ విష్ణువర్ధన్‌– శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) ద్వయం 6–2, 6–4తో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ సెంటినరీ (అమెరికా) సామి రెన్‌వెన్‌ (జర్మనీ) జంటపై గెలుపొంది విజేతగా నిలిచింది.

ఈ గెలుపుతో విష్ణువర్ధన్‌ ఖాతాలో 32వ డబుల్స్‌ టైటిల్‌ చేరింది. మరోవైపు సింగిల్స్‌ విభాగంలో విష్ణువర్ధన్‌ పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ ప్రజ్నేశ్‌ గున్నేశ్వరన్‌ 7–6 (7/4), 6–4తో మూడో సీడ్‌ విష్ణువర్ధన్‌పై గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నాడు. మరో సెమీఫైనల్లో శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌) 6–1, 6–2తో సామి రెన్‌వెన్‌ (జర్మనీ)ని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement